కరోనా వైరస్ ఇండియాలోకి కూడా వచ్చేసింది, ఇది మరీ ఎక్కువయితే చాలా కష్టమే అన్నారు చాల మంది. ఈ మాటను తప్పు అని మినాల్ దఖావే భోశాలీ (Minal Dakhave Bhosale) చేసి చూపించారు. వైరాలజిస్ట్ అయిన ఆమె… ఓవైపు ప్రసవ వేదనతో బాధపడుతూ కూడా కరోనా వర్కింగ్ టెస్ట్ కిట్‌ను 6 weeks లో తయారుచేశారు.
అది తయారుచేసిన తర్వాత కొన్ని గంటలకే మినాల్ దఖావే భోశాలీ కు డెలివరీ అయ్యి పాప పుట్టింది. ఇలాంటి టెస్టింగ్ కిట్ విదేశాల్లోనైతే 3 నుంచి 4 నెలలు పడుతుంది. గురువారం (26-3-2020) తొలి మేడ్ ఇన్ ఇండియా కరోనా టెస్ట్… ఇండియా మార్కెట్లోకి వచ్చింది. దీని ద్వారా ఇండియన్స్ ను తక్కువ సమయంలో ఎక్కువ మందిని స్క్రీనింగ్ చేసేందుకు అవకాశం లభించింది.
పుణెలోని మైలాబ్ డిస్కవరీ (Mylab Discovery) కంపెనీకి టెస్టింగ్ కిట్స్ తయారీ చేసి, అమ్మకం చేయడానికి అనుమతులు లభించాయి. మొదటగా కిట్లను పుణె, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు పంపింది. ఇప్పటివరకు 150 కిట్ లను supply చేసింది.
2nd బ్యాచ్ కిట్లను సోమవారం పంపబోతోతున్నట్లు Mylab Discovery తెలియజేసారు. వారానికి లక్ష కొవిడ్-19 టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయగలమని , అవసరమైతే… 2 లక్షలు కూడా ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు.
ఒక్కో కరోనా టెస్టింగ్ కిట్నీ Mylab Discovery కంపనీ రూ.1200 గ వుంది. విదేశాల కిట్ ల ధర 4500 రూపాయలు గా ఉంది.ఈ కిట్ ద్వారా రెండున్నర గంటల్లో టెస్టింగ్ పూర్తవుతుంది. కరోనా ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది. అదే విదేశీ కిట్ల ద్వారా 6 నుంచి 7 గంటలు పడుతోంది.
ప్రెగ్నెన్సీ కారణంగా సెలవుపై ఫిబ్రవరిలో ఇంటికి వచ్చిన భోశాలీ… తనే టెస్ట్ కిట్ చెయ్యాలని అనుకున్నారు. చాలెంజ్‌గా తీసుకున్నారు. మొత్తం 10 మంది టీమ్‌తో కలిసి… విజయవంతంగా పని పూర్తి చేశారు.
మార్చి 18న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి టెస్ట్ కిట్‌ను పంపారు. ఆ తర్వాత ఇండియన్ FDA, డ్రగ్స్ కంట్రోల్ అథార్టీ CDSCOలను వాణిజ్యపరంగా తయారుచేసేందుకు అనుమతి కోరారు. వెంటనే అనుమతి లభించింది. ఈ కిట్ ద్వారా ఒకే శాంపిల్‌ని 10 సార్లు టెస్ట్ చేసినా… ఫలితాలు ఒకేలా వస్తాయి. అందువల్ల ఈ కిట్‌కి అనుమతి లభించింది.
కరోనా వైరస్ సందేహాల కోసం WHO మరియు ఇండియా వాట్సాప్ హాట్ లైన్
దఖావే భోశాలీ మన దేశానికే గర్వకారణం. ఆమె కృషిని నిజంగా ప్రసంసించాల్సిందే… ఈ ఆర్టికల్ తప్పకుండా Like చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి. #MadeInIndia #JaiHindh