Sunday, November 17, 2024
HomeEducationకేంద్రీయ విద్యాలయం లో మీ పిల్లలను ఎందుకు చదివించాలి?

కేంద్రీయ విద్యాలయం లో మీ పిల్లలను ఎందుకు చదివించాలి?

History and benefits of studying in Kendriya Vidyalayas ( KVS ) Telugu

కేంద్రీయ విద్యాలయం భారత కేంద్ర ప్రభుత్వపు మానవ వనరుల అభివృద్ధి శాఖ Ministry of Human Resource Development (MHRD) ద్వారా స్వయం ప్రాతిపదికన నడుపబడే విద్యాలయం.

1965 లో “సెంట్రల్ స్కూల్స్” పేరుతో భారత ఆర్మీలో పనిచేసే సైనికుల పిల్లల కోసం స్థాపించబడినది. తర్వాత “కేంద్రీయ విద్యాలయం” గ Kendriya Vidyalayas ( KVS )  పేరు మార్చారు.

ఇండియా లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో (Kathmandu, Moscow, Tehran) కూడా ఉంది. ఇండియా లో మొత్తం 25 Region లలో 1235 స్కూల్స్ , 45477 అధ్యాపకులు మరియు 1315708 విద్యార్ధులు ఉన్నారు.

ఆర్మీ వారు సొంత విద్యాలయాలు నెలకొల్పాక కేంద్రీయ విద్యాలయాలను మిగిలిన అన్ని కేంద్ర సంస్థలకు అందుబాటులో తెచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకే సిలబస్ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనబడే సంస్థ ఈ విద్యాలయాలను నడుపుతుంది.

కేంద్రీయ విద్యాలయం లో Central Board of Secondary Education (CBSE) సిలబస్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ లో ఒకే సిలబస్ ఉంటుంది. బోధన ఇంగ్లీష్ మరియు హిందీ లో ఉంటుంది.

సంవత్సరము లొ ఎప్పుడైనా మరో బ్రాంచ్ కి transfer అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సంస్కృతం సబ్జెక్టు 6 మరియు 7 తరగతులకు తప్పనిసరి. 12 తరగతి వారికి తప్పనిసరి కాదు.

Benefits of Studying in Kendriya Vidyalaya School ( KVS )

కేంద్రీయ విద్యాలయం లో చదవడం వలన లాభాలేంటి? ఎందుకు KVS లో చేర్పించాలి ? అనే సందేహానికి క్రింది వివరణ ద్వారా సమాధానం దొరుకుతుంది.

  • KVS సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దేశంలో వివిధ ప్రాంతాల నుండి విద్యార్ధులు వస్తారు. దీనివలన స్టూడెంట్ కి వివిధ భాషల వారు పరిచయం అవుతారు , తద్వారా వారి భాషను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ప్రైవేటు స్కూల్స్ లో ఉన్న facilities అన్ని ఇక్కడ ఉంటాయి.
  • చదువుతో పాటు గా స్టూడెంట్ టాలెంట్ కు అనుగుణం గా తన ఇంటరెస్ట్ తగినట్లు ( స్పోర్ట్స్ , గేమ్స్, డ్రాయింగ్, మొదలగునవి ) నేర్చుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది.
  • కేంద్రీయ విద్యాలయం స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయులు మంచి అనుభవం ఉన్నవారిని , నేషనల్ లెవల్ పరీక్షలలో ఉతీర్నులయిన వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. కాబట్టి విద్యార్ధులకు knowledge ని పెంచుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది.
  • విద్యార్థులకు చదువు, సంస్కారం తో పాటు extra activities ద్వారా self  development కి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
  • పిల్లల పైన stress ఎక్కువ ఉండదు. ఎక్కువ హోం వర్క్ లు ఇవ్వడం లాంటివి ఉండవు. KVS లో స్టూడెంట్స్ లు టూషన్ లు అవసరం లేని విధం గా చదువు చెప్తారు.
  • ఒక్కో క్లాసులో కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు.
  • సెంట్రల్ గవర్నమెంట్ సంబంధిన ఉద్యోగాలలో KVS స్టూడెంట్స్ కి Priority ఉంటుంది.
  • కేంద్రీయ విద్యాలయం అధికారిక వెబ్సైటు https://www.kvsangathan.nic.in/

దేశంలో కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో సీట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అక్కడ తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతుంటారు.

దేశవ్యాప్తంగా ఉన్న 1235 కేంద్రీయ విద్యాలయాల్లో లక్ష సీట్లు ఉన్నాయి. KVS అడ్మిషన్ కోసం 8 లక్షల మంది అంతకు మించి దరఖాస్తులు వచ్చే అవకాశముంది.

తర్వాతి ఆర్టికల్ లో Kendriya Vidyalaya ( KVS ) Admission Process / Eligibility గురించి తెలుసుకుందాం.

ఈ ఆర్టికల్ పైన మీ అబిప్రాయాలు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments