Sunday, November 17, 2024
HomeMobilePhonePe న్యూస్ : గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్ పే Indus App Store

PhonePe న్యూస్ : గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్ పే Indus App Store

PhonePe Indus App Store పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా కొత్తగా ఆప్ స్టోర్ ను తీసుకువచ్చింది. డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌లో ఒకటైన Phonepe కంపనీ ఈ ఆప్ స్టోర్ ను ఈ శనివారం (Sep 23rd 2023) నుండి ప్రారంబిస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • ఇండియా కు సంబందించిన ఆండ్రాయిడ్ డెవలపర్స్ తమ ఆండ్రాయిడ్ (మేడిన్ ఇండియా ) Apps ను Phonepe Indus app స్టోర్ లో అప్‌లోడ్ చేయొచ్చని ఫోన్‌పే ప్రకటించింది.
  • Android Developers తమ apps ను https://www.indusappstore.com/ వెబ్సైటు లో అకౌంట్ create చేసుకుని లిస్టు చేయవచ్చు.
  • ఈ యాప్ 12 భారతీయ భాషలలో అందుబాటులో వుంటుంది
  • ఆండ్రాయిడ్ డెవలపర్లు యాప్స్‌ను Indus app స్టోర్ లో డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లో మొదటి సంవత్సరం ఉచితం గా  లిస్ట్ చేయొచ్చు. రెండవ సంవత్సరం నుండి అతి తక్కువ ఛార్జ్ చేస్తారు.
  • In App Purchase కు ఎలాంటి అదనపు ప్లాట్ఫారం ఫీజులు , కమిషన్ లు వసూలు చేయమని ప్రకటించింది.
  • Google Play Store లో In App Purchase వున్న apps సేల్ లో 30 శాతం వసూలు చేస్తుంది. 70 శాతం డెవలపర్స్ కు వస్తుంది.
  • లొకలైజేషన్, App డిస్కవరీ, ఆప్ కు ఎంత రేటింగ్ వంటి వాటి అంశంలను ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్ తో సులువుగా ఉపయోంచుకొనేలా చేశారని ఇండస్ యాప్ స్టోర్ కోఫౌండర్ ఆకాశ్ డోంగ్రీ తెలియజేసారు.
  • ఇండస్ యాప్ స్టోర్, గూగుల్ play store కు ప్రత్యామ్నాయ స్టోర్ గా ఉండబోతుందని, డెవలపర్లు వివిధ రకాల టూల్స్, ఫీచర్ల ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చునని , 24X 7 కస్టమర్ సపోర్ట్ ఉంటుందని ఫోన్‌పే పేర్కొంటోంది.
  • ఈమెయిల్ అకౌంట్ తో అవసరం లేకుండా మొబైల్ తోనే లాగిన్ అవ్వొచ్చు.
  • ఆప్ డెవలపర్ రియల్ టైమ్ యాప్ మానిటరింగ్, ఇన్స్టాల్స్ , రేటింగ్ మరియు రివ్యూ లకు సంబంధించి అనలిటిక్స్ , కాంపిటీటర్ అనాలసిస్ వంటి ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
  • 2026 నాటికి సుమారు 1 బిలియన్ యూసర్ లను సంపాదిస్తుందని అంచనావేస్తున్నారు.
  • ప్రస్తుతానికి developers కు మాత్రమే అందుబాటులో ఉంది , త్వరలో ఆండ్రాయిడ్ users కూడా apps ను Indus App Store డౌన్లోడ్ చేసి install చేసుకోవచ్చు.

Also Read : YouTube Channel Creators కు ఉపయోగపడే 3 మంచి టూల్స్

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments