Reliance Jio ఇప్పుడు jio meet పేరుతో వీడియో calling App ను రానుంది.
టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయడానికి రిలయన్స్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రయత్నిస్తుంది.
దీనిలో భాగంగానే ఇప్పుడు వీడియో calling లో కూడా ప్రవేశించి, zoom మరియు google meet కు పోటీగా jio meet ను రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది.
దీనికోసం jiomeet.jio. com వెబ్సైట్ ను ready చేసింది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లభించదు.
వాస్తవానికి జియోమీట్‌ను గతంలోనే పరిచయం చేసింది రిలయెన్స్. జియోమీట్ యాప్ వీడియోకాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్లాట్‌ఫామ్.
ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో త్వరలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఔట్‌లుక్‌లో ప్లగిన్ కూడా ఉంది.
అంతేకాదు ఎవరికైనా జియోమీట్‌లో మీటింగ్‌లో జాయిన్ కావాలని లింక్ పంపిస్తే వాళ్లు గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ లాంటి వెబ్ బ్రౌజర్లలో కూడా వీడియో కాల్ మాట్లాడొచ్చు.
యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు.