WhatsApp 2020 లో రాబోతున్న ఫీచర్ లు

0
247
whatsapp-features-2020-self-destructive-multi-device-support

WhatsApp లో ఫీచర్ లు చాలానే రాబోతున్నాయి. వాట్సాప్ మెసెంజర్ ను పోలిన టెలిగ్రామ్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నవే. Facebook కొనుగోలు చేసిన తర్వాత whatsapp ను ఉపయోగించేవారు సంఖ్య 2 బిలియన్ల ను దాటింది. Users కు కొత్త ఆప్షన్స్ ను పరిచేయడం లో టెలిగ్రామ్ మెసెంజర్ తో పోల్చితే వెనకబడి ఉందనే చెప్పాలి.

Whatsapp లో ప్రయోగ దశలో ఉన్న కొన్ని ఫీచర్స్ ను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము. వీటిని 2020 లో whatsapp లో Update గా రానున్నాయి. ఈ మధ్యనే డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. డార్క్ మోడ్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Fake మెసేజ్ అరికట్టే Message Search ఫీచర్ 

Covid – 18 కరోనా వైరస్ తో ప్రజలు , ప్రభుత్వాలు ఇబ్బంది పడుతుంటే, కొందరు అబద్దపు ప్రచారాలతో మెసేజ్ లు ఫార్వర్డ్ చేయడం , పోలీసులు అలాంటి వారిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.

రోజు రోజుకి Whatsapp లో ఫేక్ మెసేజ్ ల తో అబద్దపు ప్రచారాలు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ Feature గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Whatsapp Self Destructing Message

టెలిగ్రామ్ మెసెంజర్ లో Secret Chat ఆప్షన్ గా లభ్యమయ్యే ఈ ఫీచర్ ను whatsapp ఇప్పుడు అప్డేట్ గా రాబోతుంది. ఈ Whatsapp Self Destructing లో ఎవరితో చాట్ చేయాలనుకుంటున్నామో వారితో ప్రైవేటు చాట్ చేయొచ్చు.

చాట్ చేయడానికి ముందు చాట్ history ఎంత సమయం వుండాలి అనేది set చేసుకోవచ్చు. గంటలు , రోజులు అనేది ముందుగా సెట్ చేసుకోవచ్చు . Time set చేసిన సమయం తర్వాత ఆటోమేటిక్ గా చాట్ డిలీట్ అయిపోతుంది.

Whatsapp Multi Device Support

Whatsapp ఒక అకౌంట్ ను ఒక నెంబర్ తో ఒక device లోనే ఉపయోగించే వీలుంది.

మరొక మొబైల్ లో అదే నెంబర్ ను ఉపయోగిస్తే మొదటి మొబైల్ లో logout అయిపోతుంది. Whatsapp Multi Device Support ఆప్షన్స్ ద్వారా ఒకే మొబైల్ నెంబర్ లో ఒకటికంటే ఎక్కువ మొబైల్ లలో ఉపయోగించుకునే వీలు వుంటుంది.

ఈ ఆప్షన్ ద్వారా ఏమైనా సెక్యూరిటీ సంబందించిన ప్రొబ్లెమ్స్ వస్తాయోమో అని ఈ ఆప్షన్ ను పరిశీలిస్తున్నట్లు , త్వరలో ఈ ఫీచర్ ను అప్డేట్ గా తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి .

బిజినెస్ మరియు టెక్నాలజీ వీడియో ల కోసం YouTube ఛానల్ ఇక్కడ click చేసి Subscribe  చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here