Amazon Flipkart Fake Review Finder
అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ షాపింగ్ వెబ్సైటు లలో రేటింగ్స్ చూసి కొంటున్నారా ? 90% Buyers , మంచి ప్రోడక్ట్ కోసం స్టార్ రేటింగ్ ఫిల్టర్ చేసి , 3.5 కంటే ఎక్కువ వున్నవి చూసి కొనేస్తూ వుంటారు. రేటింగ్స్ కరెక్ట్ యేనా ? కాదా అని డౌట్ వచ్చిందా ?
మీకు డౌట్ వచ్చి ఉంటే , మీ డౌట్ నిజమే. Amazon , Flip Kart లాంటి షాపింగ్ వెబ్సైటు లలో వున్నా రేటింగ్ లు కూడా నిజమైనవి కాదు. కేవలం 40 శాతం రివ్యూ , రేటింగ్ లు మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి. మిగిలిన రేటింగ్స్ అన్ని Paid మరియు fake రేటింగ్ లు ఉంటాయి.
మరి ఏ ప్రోడక్ట్ మంచి రేటింగ్ వున్న ప్రోడక్ట్ అని ఎలా తెలుసుకోవాలి ?
Manual గ Fake Reviews కనుక్కోవడం…
- రివ్యూ ఇచ్చిన వారి ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే , వారు ఒక నెలలో ఎన్ని రివ్యూస్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. 2 లేదా 3 కంటే ఎక్కువ రివ్యూ ఇచ్చిన వారి రివ్యూ ని నమ్మవద్దు.
- ప్రోడక్ట్ ను నిజం గా కొన్న వారైతే Verified ఉంటుంది. Verified Purchase అని ఉందో లేదో చూడాలి. అలా లేని ప్రొఫైల్ ను కూడా నమ్మవద్దు.
దీనికోసం సింపుల్ solution వుంది. Amazon , FlipKart వెబ్సైటు లలో ప్రోడక్ట్ రేటింగ్ రివ్యూస్ ఎంత వరకు నిజమైనవో ఒక వెబ్సైటు ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
- https://www.fakespot.com/ వెబ్సైటు ఓపెన్ చేయాలి
- అమెజాన్ వెబ్సైటు లో ఏ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటున్నారో క్లిక్ చేసి ఓపెన్ చేయాలి
- తర్వాత బ్రౌసర్ నుండి ప్రోడక్ట్ లింక్ కాపీ చేసుకోవాలి
- Fake spot website ఓపెన్ చేసి వెబ్సైటు లో వున్న Text బాక్స్ లో paste చేసి Analyze పైన క్లిక్ చేయాలి
- కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ అమెజాన్ లో రేటింగ్ , రివ్యూ లను Analyze చేసి Real Rating & Review Count చూపెడుతుంది
ఈ వెబ్సైటు ను వుపయోగించి ( Amazon Flipkart Fake Review Finder ) Fake Reviews, Bad Sellers ఎవరు అనే విషయాలు సులువుగా తెలుసుకోవచ్చు.
Also Read : అమెజాన్ లో సెల్లర్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి
Chrome Extension కూడా లభిస్తుంది . బ్రౌసర్ లో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ , ఐఫోన్ లకోసం App కూడా లభిస్తున్నాయి. Google Play Store, Apple Store లో Fake spot సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి