Business offline marketing ideas తో బిజినెస్ ని తక్కువ ఖర్చుతో మార్కెటింగ్ చేయడం ఎలా ?
Business లోకల్ గా Offline మార్కెటింగ్ చేయాలి అనుకున్నప్పుడు, సలహా కోసం అడిగితే వెంటనే వచ్చే సమాధానం ఆన్‌లైన్ మార్కెటింగ్.
ఫేస్బుక్ లో లోకల్ గా పేజి create చేసి మార్కెటింగ్ చేసుకోవడం లేదా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం , అని సలహాలు చాలానే ఇస్తుంటారు.
స్మార్ట్ ఫోన్ లు తక్కువ ఉపయోగిస్తూ, కంప్యూటర్ పైన ఎక్కువ సమయం కేటాయించడం చేయలేక ఎలా చేయాలో తెలియని వారికోసం,
Business offline marketing ideas తో లోకల్ మార్కెటింగ్ తక్కువ ఖర్చుతో ఎలా చేయాలి? అనే దాని గురించి ఈ ఆర్టికల్ సహాయపడుతుంది.
Local గా బిజినెస్ ని తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ లేకుండా చేయాలంటే ఇలా చేయొచ్చు…
- మీడియా ఎప్పుడు ఆసక్తికరమయిన విశేషాలను ప్రచురించడం లో ముందు ఉంటుంది.బిజినెస్ గురించి ఆసక్తిగా ఒక ప్రకటన తయారు చేసుకుని లోకల్ టీవీ చానల్స్ Advertise చేయడం.
- న్యూస్ పేపర్స్ మరియు Local గా ఉన్న FM రేడియో లో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వవచ్చు.
- లోకల్ చానల్స్ లేదా రేడియో స్టేషన్ లు తమ చానెల్స్ చూసే, వినే వారికోసం కంటెస్ట్ లు పెట్టి బహుమతులు ఉచితంగా ఇస్తూ ఉంటారు కదా ? ఆ బహుమతులు మీ కంపెనీ బ్రాండ్ ఉంచి , పబ్లిసిటీ ఉచితంగా చేసుకోవచ్చు.
- లోకల్ గా ఉండే వారికి కొందరికి ఉచితంగా మీ కంపెనీ వస్తువులను ఇవ్వడం ద్వారా , బ్రాండ్ ని పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళవచ్చు. వారికి కంపెనీ ప్రోడక్ట్ నచ్చితే ఉపయోగిస్తారు , నలుగురితో చెప్తారు. ఈ విధంగా కంపెనీ పబ్లిసిటీ అవుతుంది.
- అపార్ట్‌మెంట్స్, పార్క్ లు ఉన్నచోట మీ కంపెనీ గురించి , ప్రోడక్ట్ గురించి campains నిర్వహించడం ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు.
- క్లబ్స్ , పార్టీ గ్రూప్ లలో జాయిన్ అవడం ద్వారా , లోకల్ లీడర్స్ ని మీ షాప్ లేదా కంపెనీ కి ఆహ్వానితులు చేయడం ద్వారా పబ్లిసిటీ వస్తుంది.
- కంపెనీ సంబంధిత ప్రొడక్ట్స్ , క్వాలిటీ ని వివరిస్తూ పాంఫ్లెట్స్ పంచడం, బ్యానర్ లు ద్వారా కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు
- ఆఫర్స్ , డిస్కౌంట్ కూపన్స్ ఇవ్వడం ద్వారా కస్టమర్స్ ని ఎక్కువ సార్లు మీ ప్రోడక్ట్ కొనేలా చేయవచ్చు. మంచి క్వాలిటీ దొరుకుతుందని కస్టమర్ భావిస్తే ఇక మీ పర్మినెంట్ కస్టమర్ అయినట్లే.
పైన చెప్పినవి కాకుండా ఇంకేమైనా మంచి ఐడియా లు వుంటే కామెంట్ లో వ్రాయండి.
మంచి Business Man కావాలంటే ఈ తప్పులు చేయొద్దు
Franchise తీసుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నారా ?
ఈ ఆర్టికల్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.బిజినెస్ సంబందించిన వీడియో కోసం Business YouTube Channel subscribe చేయండి.