Thursday, April 25, 2024
HomeBusinessమంచి Business Man కావాలంటే ఈ తప్పులు చేయొద్దు

మంచి Business Man కావాలంటే ఈ తప్పులు చేయొద్దు

సాధారణంగా చేసే తప్పులేంటి ? అవి ఎలా సరి దిద్దుకోవాలి ?

కొత్తగా బిజినెస్ అంటే అంత చిన్న విషయం కాదు.బిజినెస్ స్టార్ట్ చేసే వారు చాలా వరకు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.తప్పులు చేయడం సహజం, ఆ తప్పులు ఏంటో తెలుసుకొని, సరిదిద్దుకొని సాగిపోవడం బిజినెస్ చేసేవారికి చాలా అవసరం.

ఒకసారి తప్పు చేసి అది తెలుసుకోకుండా, తప్పుమీద తప్పు చేస్తుంటే , బిజినెస్ లో సక్సెస్ అందుకోవడం చాలా కష్టం. బిజినెస్ ని విజయవంతంగా నడపాలంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Simple గా చెప్పాలంటే….

  • నమ్మకమయిన భాగస్వామిని యెంచుకోక పోవడం
  • మార్కెటింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడం
  • అనుకొన్న సమయానికి బిజినెస్ ప్రారంభించక పోవడం
  • బిజినెస్ గురించి సరైన ప్రకటన ఇవ్వకపోవడం
  • కస్టమర్ ని పట్టించుకోక పోవడం

ఇంకా వివరంగా తెలియాలంటే ….

  • వ్యాపార భాగస్వామిని ఎంచుకోవడం లో కొంత తెలివిని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న బిజినెస్ లకు అయితే భాగస్వామి అవసరం ఉండదు.
  • కానీ పెద్ద వ్యాపారాలకు మీరు ఎంచుకునే భాగస్వామి మీ ఆలోచన లకు అనుగుణంగా , మీ నిర్ణయాలను గౌరవించే వారుగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాలలో తప్పొప్పులను నిజాయితీగా పంచుకునే వారిని ఎంచుకోండి.
  • నాకు అన్ని విషయాలు తెలుసు అనే Over Confidence అనేది ఉండకూడదు.
  • మార్కెట్ లో పరిస్థితులు రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. కొత్తగా వచ్చే మార్పులేంటో తెలుసుకుంటూ, మార్కెటింగ్ అవసరాలకి అనుగుణంగా మన బిజినెస్ లో మార్పులు చేసుకుంటూ పోవాలి.
  • బిజినెస్ ని పెంచుకోవడం కోసం ప్రోడక్ట్ క్వాలిటీ నీ పట్టించుకోకపోవడం లాంటివి చేయొద్దు. క్వాలిటీ ప్రోడక్ట్ కస్టమర్స్ కు అందించడం పైన కూడా దృష్టి పెట్టాలి.
  • చాలామంది చేసే పెద్ద Mistake ఏంటంటే, తమ కస్టమర్ కి ఓపికతో సరైన సమాధానం ఇవ్వకపోవడం.
  • కస్టమర్ లేడంటే బుసినెస్ లేదు , కాబట్టి ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు.
  • కస్టమర్ లకు క్వాలిటీ ప్రోడక్ట్ ల గురించి వివరించి , Advertisement ల ద్వారా Attract చేయడం లాంటివి చేయాలి . దానికోసం వారితో మంచి కమ్యూనికేషన్ Maintain చేయడం ఎంతో ముఖ్యం.
  • బిజినెస్ ని మార్కెటింగ్ చేసుకోవడం లో టెక్నాలజీ పాత్ర ఎంత ఉందో గుర్తించకపోవడం.
  • టెక్నాలజీ ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
  • మీ వలన ఏమైనా పొరపాటులు జరుగుతుంటే , మీ బిజినెస్ భాగస్వాముల తో ఎప్పటికప్పుడు చెప్పడం మంచిది.
  • బిజినెస్ పరంగా మీ శత్రువులు వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ competitor మీరు చేసే తప్పులకోసం ఎదురు చూస్తూ ఉంటారు .
  • చిన్న తప్పులే కొన్ని సమయాల్లో competitor కి అదనుగా మారవచ్చు. అలాంటి తప్పులకు జరగకుండా చూసుకోవాలి.
  • ఆర్ధిక పరమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. బిజినెస్ లో ఫైనాన్స్ సంబంధిత విషయాలలో తప్పు చేస్తే మీ వ్యాపారం పేకమేడలా కూలిపోతుంది.
  • ఫైనాన్స్ సంబంధిత విషయాలలో అవగాహన తక్కువ ఉంటే,Finance Adviser ని నియమించింది సలహాలు పొందడం ఎంతో మంచిది.
  • బిజినెస్ ప్లాన్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఎప్పుడు ప్రారంభిస్తే మంచిదో తెలుసుకొని , సరైన సమయం లో బిజినెస్ ప్రారంబించాలి.
  • సరైన ప్లాన్ లేకుండా బిజినెస్ ని విస్తరించకూడదు. ఎక్కడ విస్తరించాలో, ఆయా ప్రాంతాలలో బిజినెస్ కి అనుకూలంగా ఉందా ? లేదా ? అని తెలుసుకుని, ప్లాన్ చేసుకోవాలి.
  • వ్యాపార లావాదేవీలు సరిగా ఉండేలా చూసుకోవాలి. డబ్బు చేతిలో ఉందని అవసరం లేకున్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మంచిదికాదు.
  • ఈ రోజు సాధించిన విజయాన్ని చూసి తృప్తి పడటం కాదు , కొత్త విషయాలను తెలుసుకుంటూ భవిష్యత్తులో చేయబోయే బిజినెస్ అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేసుకుంటూ … మీ బిజినెస్ ని అభివృద్ధి పథంలో నడపడం అలవరచుకోవాలి.

ఈ ఆర్టికల్ పైన మీ అబిప్రాయాలు , ఇంకేమైనా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments