గూగుల్ AdSense Approval ప్రాసెస్ ఏంటి ? మనీ ఎలా వస్తాయి?

0
254
Google adsense process in Telugu_How to get Adsense approval in 3 days_1

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ తో మనీ సంపాదించేవారు కూడా వున్నారు.

మీలో ఆర్టికల్ writing skills వుంటే, మీరు ఇంటిదగ్గర నుండే ఒక వెబ్సైటు ద్వారా మనీ సంపాదించుకోవచ్చు.

మీ వెబ్సైటు ఎక్కువ మంది చదువుతూ వుంటే,మీ వెబ్సైటు లో Advertisements Place చేయడం ద్వారా,వెబ్సైటు లో పేజి views మరియు వెబ్సైటు లో మీరు ఉంచిన Advertisements పైన క్లిక్ లు పొందడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

మీ రైటింగ్ టాలెంట్ ని పెట్టుబడిగా చేసుకొని ఇంటిదగ్గర నుండే వెబ్సైటు Startup బిజినెస్ చేయాలనుకొనే వారికోసం ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. 

AdSense ఏంటి? దాని Benefits ఏంటి ?

ఆన్ లైన్ లో Money సంపాదించేందుకు ఉండే మార్గాల్లో ఒకటి వెబ్ సైట్లలో Advertisements ఉంచి సంపాదించడం.

దీనికోసం చాలా Advertisement నెట్‌వర్క్ లు ఉన్నాయి . వాటిలో ముఖ్యమయినవి గూగుల్ Adsense ,Facebook Instant Articles. Advertisements నెట్వర్క్ లు ఇంకా చాలానే ఉన్నాయి .ఎన్ని ఉన్నా గూగుల్ Adsense కి పోటీ రాలేక పోతుంది .

Adsense ద్వారా ఎన్నో వెబ్ సైట్ ల వాళ్ళు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వెబ్సైటు StartUp  బిజినెస్ గా చేసుకొని , ఆన్ లైన్ లో డబ్బు సంపాదించే మార్గాల్లో Adsense ఒకటి.

AdSense నుండి డబ్బు ఎలా వస్తుంది ?

Adsense approve  అయిన తర్వాత , Ads మన బ్లాగు లేదా వెబ్ సైట్ లో Display కావాలంటే Adcode ని Place చేయాల్సి ఉంటుంది .

తర్వాత మన వెబ్ సైట్ లో Ads Display అవుతాయి . బ్లాగ్ ని చూసిన visitor లు ఆ Advertisements క్లిక్ చేయడం ద్వారా మన ఎకౌంటు లో డబ్బు వస్తుంది.

Adsense పొందడం ఎలా? ఎలాంటి వెబ్ సైట్ కి Adsense Approve అవుతుంది ?

Adsense approve పొందాలంటే కొన్ని రూల్స్ Follow అవాల్సి ఉంటుంది . ఒకసారి Approve అయిన తర్వాత ఒక Adsense Code ఎన్ని వెబ్ సైట్ లలో అయినా వాడుకోవచ్చు. తెలుగు వెబ్సైటు లకు కూడా గూగుల్ adsense approve అవుతుంది. 

Adsense Approve కావాలంటే ఏమి చేయాలి?

 • మొదట వెబ్ సైట్ వుండాలి
 • Approve కావాలంటే వెబ్ సైట్ లో 20 నుండి 30 ఆర్టికల్స్ ఉండాలి.

Google Ad-sense Approval process ఏంటి ?

 • మొదటి గా మనకు ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ వుండాలి.
 • Blogger లేదా WordPress లో బ్లాగ్ తయారు చేసినా కూడా మన సొంత డొమైన్ వుంటే Approval కి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఆర్టికల్స్ ఎలా వుండాలి ? ఏ భాష లో వుండాలి ? ఎలాంటి విషయాలు రాయకూడదు ?

 • వెబ్ సైట్ లో వుండే ఆర్టికల్స్ తప్పకుండా ఇంగ్లీష్ లేదా హిందీ లేదా తెలుగు లో వుండాలి
 • మీరు రాసే ఆర్టికల్స్ పూర్తి గా మీ సొంతమై వుండాలి , వేరే వెబ్ సైట్ లో ఆర్టికల్స్ కాపీ చేయకూడదు.
 • వెబ్ సైట్ లో కనీసం 20 నుండి 30 ఆర్టికల్స్ ఉండాలి . ప్రతి ఆర్టికల్ లో కనీసం 500 words ఉండేలా చూసుకోవాలి. 2 లేదా 3 ఆర్టికల్స్ 2000 వర్డ్స్ ఉండేలా చూసుకోవాలి . 
 • ఆర్టికల్స్ లో మధ్యమధ్యలో ఉండే ఇమేజ్ లు గూగుల్ నుండి కాపీ చేయవచ్చు , కానీ కాపీహక్కులు (Copyrights) ఉండే ఇమేజ్ లు ఉపయోగించకూడదు.
 • Adult Related మరియు హింస ను ప్రేరేపించేలా వుండే లా ఆర్టికల్స్ ఉండకూడదు .సాఫ్ట్వేర్ లకు సంబందించిన డౌన్లోడ్ లు , సాఫ్ట్వేర్ Hacking , డ్రగ్స్ , ఆల్కహాల్ , పొగాకు, మారణాయుదాలు  సంబందించిన  లాంటి  విషయాలు ఉండకూడదు .
 • దీనిగురించి మరింత సమాచారం కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

వెబ్ సైట్ డిజైన్ ఎలా వుండాలి ? వెబ్సైటు లో ఇంకా ఏమి ఉండకూడదు ?

 • వెబ్సైటు డిజైన్ చాలా clear గా వుండాలి , మీ వెబ్సైటు visitor లకు సులువు గా ఉండేలా Navigation అర్ధమయ్యేలా వుండాలి .
 • గూగుల్ Adsense వాళ్ళు మన Request ని approve చేసేముందుగా పరిశీలించేది మన వెబ్సైటు Neat గా మంచి లుక్ తో వుందా లేదా అని. Manual గా open చేసి check చేస్తారు. కాబట్టి మన వెబ్సైటు డిజైన్ చాలా ముఖ్యం.
 • Approval కి రిక్వెస్ట్ పంపేముందు మన వెబ్సైటు లో ఏ ఇతర Advertisement లు ఉండకూడదు .
 • వెబ్సైటు లో కొన్ని అదనపు పేజి లను( Contact Us,About Us,Privacy Policy,Disclaimer Policy) Add చేయవలసివుంటుంది . 

 ఇవి కాకుండా ఇంకా కొన్ని చేయాలి … అవేంటంటే … 

ఈ క్రింద చెప్పినవి కూడా చేస్తే Adsense Approval సులువు గా వచ్చేందుకు సహాయపడుతాయి . ఇవేవో కష్టమయిన పని అనుకోవద్దు , ఇవి కూడా చాలా సులువు గా చేసేయవచ్చు . అవి ఏంటంటే .. 

 • Google Analytic కోడ్ వెబ్సైటు కి Add చేయడం ( దీని ద్వారా మన వెబ్సైటు కి ఎంత మంది visitors వస్తున్నారు , ఏ పేజీ లను ఎక్కువ చూస్తున్నారు ? ఏ Location నుండి చూస్తున్నారు ? ఎంత మంది LIVE లో వున్నారు అనే విషయాలుమనం Track చేసుకోవచ్చు. 
 • XML Site Map ద్వారా వెబ్సైటు గూగుల్ సెర్చ్ లో మన వెబ్సైటు త్వరగా సెర్చ్ అయ్యేందుకు గూగుల్ బోట్స్ కి సహాయపడుతుంది. 
 • Google లేదా Bing Webmaster tool లో మన వెబ్సైటు Add చేయడం ద్వారా , మన వెబ్సైటు లో ఏమైనా Issues వుంటే సులువు గా కనుగొనవచ్చు.
 • పైన చెప్పిన విషయాలు తర్వాతి ఆర్టికల్ లో చూద్దాం. 

చూసారు కదా ? ఇంత కధ వుంది AdSense approve కావాలంటే .. పైన చెప్పినవన్నీ ఏదో బ్రహ్మ విద్యలు కావు … చాలా సులువు ..

పరిచయం లేని ఏ విషయమైనా అలానే వుంటుంది కదా ? పైన చెప్పిన Process మొత్తం  పాటిస్తే 100% మీరు గూగుల్  Adsense Approval సులువు గా పొందవచ్చు.

వెబ్సైటు కి Approve అయిన Ads వెబ్సైటు లో ఎలా display అవుతాయి ?

Adsense approve అయిన తర్వాత Adsense అకౌంట్ లో Login అయిన తర్వాత , Ads ఎలా Display కావాలో code create చేసుకొని వెబ్సైటులో లో Place చేయాల్సి ఉంటుంది.  

అదేవిధంగా Facebook instant ఆర్టికల్స్ ( గూగుల్ ad-sense లాంటి మరో Advertisement నెట్వర్క్ ) నుండి కూడా మనీ సంపాదించవచ్చు.

ఈ process follow అవుతూ Ad-sense కోసం కావాలనుకునేవారు , ఏమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ చేయండి.

ఇవి కూడా చదవండి :

ఇలాంటి బిజినెస్ మరియు టెక్నాలజీ వీడియో ల కోసం ఇక్కడ క్లిక్ చేసి YouTube ఛానల్ subscribe చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here