ఆండ్రాయిడ్ మొబైల్ స్లో గా లోడ్ అవుతుందా ? స్లో గా లోడ్ అవడం వలన చాలా చికాకుగా అనిపిస్తూ వుంటుంది కదా ?
ఈ ఆర్టికల్ లో ఇవ్వబడిన కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్ ను మునుపటికంటే వేగంగా చేయవచ్చు . దీనికోసం ఎటువంటి software ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే , మొబైల్ లో ఉన్న కొన్ని సెట్టింగ్ లు మార్చడం ద్వారా ఈ పని చేయవచ్చు .
ఈ సెట్టింగ్ లను మార్చాలంటే ముందుగా మొబైల్ ను Developer Mode లోకి మార్చాల్సి ఉంటున్నది .
మొబైల్ ను Developer Mode లోకి ఎలా మార్చాలి ?
ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి Developer ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. developer ఆప్షన్స్ లేదంటే , About Devices ఆప్షన్ పైన Tap చేస్తే వచ్చే screen లో Build Number ఆప్షన్ వుంటుంది.
Build Number ఆప్షన్ పైన 7 సార్లు Tap చేస్తే మొబైల్ లో Developer ఆప్షన్ వస్తుంది .తర్వాత Settings screen లోకి వెళ్ళితే Developer ఆప్షన్ కనబడుతుంది . ( సెట్టింగ్స్ స్క్రీన్ లో చూడండి )
- Developer ఆప్షన్ లో చివర లో Windows Animation Scale,Trasaction Animation Scale,Animatio Duration Scale ఆప్షన్స్ చూడవచ్చు , అది Default గా 1X సెట్ చేయబడివుంటుంది ( 1x నుండి 10 x వరకు ఉంటాయి).
- Anmation Off చేయోచ్చు లేదంటే తగ్గించుకోవడం (0.5) చేయాలి.Windows వేగం గా లోడ్ అవడం గమనించవచ్చు
- Developer ఆప్షన్ లో Apps సెక్షన్ లో Do Not Keep Activities , Check Box సెలెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించే App నుండి Exit అయితే Background లో App రన్ అవకుండా close అవుతుంది .
- దీని ద్వారా మొబైల్ వేగం గా వుంటుంది . కానీ whatsapp , facebook app లు close చేసినా కూడా Background లో రన్ అవాల్సిన అవసరం లేదనుకొన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు .
- ఒకేసారి ఒకటికంటే ఎక్కువ Apps రన్ అవుతున్నప్పుడు , కొన్ని సమయాల్లో ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాము కదా ? అలా ఎన్ని apps ఓపెన్ కావాలనే Limit సెట్ చేసుకోవచ్చు .
- Default గా Standrd వుంటుంది (ఓపెన్ చేసిన Apps లో ఏ App కయినా మారే అవకాసం వుంటుంది ) . Apps మనకు Background లో ఎన్ని కావాల్సిన Number ( 1 నుండి 4 ) సెట్ చేసుకోవచ్చు . ఒకటి కూడా వద్దనుకొంటే No Background Processes సెట్ చేసుకోవచ్చు .
Technology Telugu Information కోసం ఇక్కడ క్లిక్ చేసి Telugu Startup youtube ఛానల్ subscribe చేయండి.