Tuesday, November 19, 2024
HomeBusinessబిజినెస్ లో మీ ప్రత్యర్థిని సమర్ధవంతంగా  ఎదుర్కోవడం ఎలా ?

బిజినెస్ లో మీ ప్రత్యర్థిని సమర్ధవంతంగా  ఎదుర్కోవడం ఎలా ?

బిజినెస్ లో మీ ప్రత్యర్థిని సమర్ధవంతంగా  ఎదుర్కోవడం ఎలా ? Business competitors Analysis

Startup బిజినెస్ చేసే వారు మంచి బ్రాండింగ్, ప్లానింగ్, కస్టమర్ satisfaction ఇవి మాత్రమే కాదు.

ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి ? వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టి , వారి వలన మన బిజినెస్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా ప్రత్యర్థులను సమర్ధవంతం గా తిప్పికొట్టాలి మరియు పోటీ ని ఎలా ఎదుర్కోవాలి  అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

బిజినెస్ లో ప్రత్యర్థి కదలికలను గమనిస్తూ ఉండాలి – Business competitors Analysis

బిజినెస్ లో ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు ? కస్టమర్ లను తమ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ? అనేది కనిపెడుతూ దానికి తగినట్లు మన కదలికలను వేయాల్సి ఉంటుంది.

అలాగని ఎప్పుడు ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు అనే దాని కోసం మన విలువైన సమయాన్ని మొత్తం వృధా చేయకూడదు. ప్రత్యర్థి మార్కెట్లో ఎలా వ్యూహ రచన చేస్తూ ముందుకు పోతున్నాడు , అనే దాని గురించి, వారి యొక్క బలాలు , బలహీనతలను గమనిస్తూ ఉండాలి.

ప్రత్యర్థి నుండి కూడా కొన్ని నేర్చుకోవాలి

మనలో లోపాల గురించి మనకంటే మన ప్రత్యర్థికి ఎక్కువ తెలుస్తాయి. తప్పిదాలు చేస్తూ , ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు.

వారు చేసే బిజినెస్ లో ఏమైనా తప్పులు చేస్తుంటే, వాటిని గమనిస్తూ అలాంటి తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడటం నేర్చుకోవాలి.

మార్కెటింగ్ అనేది ఏ బిజినెస్ కి అయినా చాలా ముఖ్యం.కస్టమర్ ని తమ వైపు రాబట్టుకోవడం లో వారు అనుసరిస్తున్న మార్గాలు గమనిస్తూ , వారి నుండి కూడా కొత్త విధానాలను నేర్చుకుంటూ మన ఆలోచనలకు పదును పెడుతూ, సరికొత్త విధివిధానాల ద్వారా మార్కెటింగ్ సమర్ధవంతం గా చేస్తూ బిజినెస్ ని విజయవంతంగా నడిపించాలి.

పోటీ తత్వం ఉంటేనే మనం ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సరి కొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి.

మనలోని సృజనాత్మకత బయటికి తీస్తూ అభివృద్ది దిశగా బిజినెస్ ను నడిపించేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది.

సరైన క్వాలిటీ , బ్రాండింగ్, కస్టమర్ Satisfaction

కస్టమర్ కి సరైన క్వాలిటీ ప్రోడక్ట్ అందజేయడం, వారికి వచ్చిన సందేహాలు సహనం తో తీర్చడం , వారికి మీ వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ సర్వీస్ చేయడం లాంటివి కూడా మీ బిజినెస్ కు ఎంతో అనుకూలిస్తాయి. మీ కస్టమర్ లను మీ ప్రత్యర్థి వైపు వెళ్ళకుండా చూసుకోవచ్చు.

ప్రత్యర్థి చేసే మానసిక దాడిని ఎదుర్కునే మనస్థైర్యం అలవరచుకోవాలి

మానసికంగా మిమ్మల్ని దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు గోతి కాడ నక్క లా కాచుకొని కూర్చొని ఉంటారు. మాటలతో , చేతలతో మీ మనస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

అలాంటి వారి మాటలను అసలు పట్టించుకోవద్దు. సహనం గా ఉంటూ, సమర్ధవంతంగా వారి వ్యూహాలను, ప్రతి వ్యూహాలతో తిప్పికొడుతూ, బిజినెస్ కి ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాలి.

బ్రాండింగ్ ని కాపాడుకోవాలి

బిజినెస్ ప్రారంభించే ముందుగా, బ్రాండింగ్ సంబంధించిన విషయాలు అందరి ముందు ప్రస్తావించ వద్దు (బిజినెస్ నేమ్ , Logo, వెబ్‌సైటు నేమ్ ).

మార్కెట్ లోకి మీ బిజినెస్ ప్రారంభించే వరకు ఇలాంటి విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది.

మీ బిజినెస్ ని దెబ్బతీయడానికి , అవకాశం దొరికితే మీ వెనుక గోతులు తవ్వేందుకు ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు .

సమయస్పూర్తితో అలాంటివి మీ సమయస్పూర్తితో తిప్పి కొడుతూ , బిజినెస్ ను విజయవంతంగా నడిపించేందుకు కృషి చేయాలి.

✅ మంచి Business Man కావాలంటే ఈ తప్పులు చేయొద్దు

✅ Franchise తీసుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నారా ?

బిజినెస్ మరియు టెక్నాలజీ వీడియో ల కోసం YouTube ఛానల్ ఇక్కడ click చేసి Subscribe  చేయండి 

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అబిప్రాయాలు కామెంట్ చేయండి.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments