HomeBusinessTrade Trademark యొక్క ఉపయోగం ఏంటి ? Trademark ఎలా apply చేయాలి ?

Trade Trademark యొక్క ఉపయోగం ఏంటి ? Trademark ఎలా apply చేయాలి ?

ఈ ఆర్టికల్ లో బ్రాండింగ్ కి సంబంధించిన అతి ముఖ్యమయిన Trade Trademark యొక్క ఉపయోగం ఏంటి ? Trademark ఎలా apply చేయాలి ? Trademark (TM) కు R కు తేడా ఏంటి అనే విషయాలు తెలుసుకొందాము.

Trademark అనేది ఒక symbol లేదా ఒక Word లేదా ఒక Sign గా ఉండవచ్చు. కానీ ఇతర బిజినెస్ కు సంబంధించినవిగా ఉండకూడదు.

Trade Trademark యొక్క ఉపయోగం ఏంటి ?     

  • Trademark అనేది మీ బిజినెస్ కు ఒక ప్రత్యేకత ను తెలియజేయడమే కాక కస్టమర్ లలో మీ బిజినెస్ పట్ల Trust మరియు Good Will ను పెంచుతుంది.
  • మార్కెట్ లో బిజినెస్ కు ఓ ప్రత్యేకత ను కల్పించడంతోపాటు , Trademark బిజినెస్ Growth చాలా ఉపయోగపడుతుంది.
  • Trademark చేయించడం ద్వారా, బిజినెస్ కు సంబంధించిన Name / Logo ను ఇతరులు ఉపయోగించకుండా మన బ్రాండ్ value ను దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు.
  • ఒకవేళ ఇతరులు మీ బ్రాండింగ్ ను మీకు తెలియకుండా ఉపయోగిస్తున్నట్లయితే Legal గా Action తీసుకోవచ్చు.
  • ఇండియా లో Trademark చేయిన్చుకున్నట్లయితే , ఇండియా లో మాత్రమే దానికి Value ఉంటుంది.
  • Trademark రిజిస్ట్రేషన్ కు కాలపరిమితి 10 సంవత్సరములు మాత్రమే , తర్వాత మరలా Re-newel చేయించుకోవలసి ఉంటుంది.

బిజినెస్ చేసే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే … ఎప్పుడు Trademark తీసుకోవాలి? Trademark తీసుకోవడానికి మంచి సమయం ఏంటి ? 

బిజినెస్ ప్రారంభం చేసిన టైం లోనే Trademark చేయించడం మంచిది. ముందుగా చేయించడం వలన  బిజినెస్ ప్రారంభం లోనే కస్టమర్ లలో మీ సర్వీస్ పట్ల ఒక నమ్మకం కలుగజేయవచ్చు.

అంతేగాక ఇతరులు మన బిజినెస్ సంబంచిన Name ఉపయోగిస్తున్నారా ? లేదో అనే విషయాలు తెలుసుకోవచ్చు. బిజినెస్ Grow అయిన తర్వాత మనకు సంబంధించిన బిజినెస్ Name ఇతరులు ఇదివరకే Trademark చేయించి ఉంటే మీ బిజినెస్ కు బ్రాండింగ్ విషయం లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఇదివరకే ఇతరులు Trademark చేయించి ఉన్న Name మీ బిజినెస్ కి కొంచం చిన్న, చిన్న మార్పులతో మీ బిజినెస్ ఉపయోగించినా కూడా copyright problem వచ్చే అవకాసం ఉంది. కాబట్టి ముందుగా మీరు ప్రారంబించాలనుకొన్న బిజినెస్ కు సంబంధిన పేరు ఇది వరకే రిజిస్టర్ అయి ఉందో లేదో సరి చూసుకొని బిజినెస్ ప్రారంభం లోనే Trademark రిజిస్టర్ చేయించడం మంచిది. బిజినెస్ ప్రారంభానికి ముందు కూడా Trademark రిజిస్ట్రేషన్ చేయించవచ్చు.

ఇతర బ్రాండింగ్ ను రిజిస్టర్ పోలిన పేర్లు కూడా మన బిజినెస్ కు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే ఏమవుతుందో 2003 లో Microsoft vs MikeRoweSoft మధ్య జరిగిన Case ఒక ఉదాహరణ.

కెనెడా కు చెందిన Mike Rowe అనే 17 ఏళ్ళ కుర్రాడు తన గ్రాఫిక్ డిజైన్ సంబంధించిన బిజినెస్ కోసం పేరును తన పేరు చివర Soft కలిపి MikeRoweSoft గా ఉపయోగించడం జరిగింది. MikeRoweSoft.com పేరుతో వెబ్ సైట్ ను కూడా ప్రారంబించాడు.

ప్రారంబించిన కొన్ని రోజులకే Microsoft వారు తమ బిజినెస్ ను పోలిన Name ఉందని case ఫైల్ చేయడం జరిగింది. తర్వాత Mike Rowe తో చిన్న ఒప్పందం చేసుకొని MikeRoweSoft.com వెబ్సైటు ను Microsoft స్వాధీనం చేసుకున్నారు. Case గురించి పూర్తి సమాచారం కోసం Microsoft vs MikeRoweSoft అని గూగుల్ లో సెర్చ్ చేయవచ్చు.

Trademark Filing process ఏంటి ?        

ముందుగా మీకు సంబంధించిన బిజినెస్ పేరు లేదా Logo తో ఇదివరకే ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారా ? లేదా ? check చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Wordmark దగ్గర సెర్చ్ చేయాలనుకున్న word Enter చేయాలి. Class దగ్గర మీ బిజినెస్ దేనికి సంబంధిచిన class code ఇవ్వవలసిన ఉంటుంది. బిజినెస్ కు సంబంధించిన Class code కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

బిజినెస్ కు సంబంధించిన Name / Logo  ఎవరికి లేనిపక్షం లో మనకు కావలసిన Business Name / Trademark కోసం Apply చేసుకోవచ్చు.

Trademark ఎవరు file చేస్తారు?

Company Secretary మరియు Trademark Authorized Agent ల ద్వారా Trademark apply చేయాల్సి ఉంటుంది. లేదా ఆన్‌లైన్ లో కూడా Trademark Apply చేయడానికి https://cleartax.in/ , https://www.indiafilings.com  https://vakilsearch.com మొదలగు ఎన్నో వెబ్ సైట్ లు ఉన్నాయి.

Individual లేదా Business అనే దాని ప్రకారం fees అవుతుంది. Government ఫీజు కాకుండా, Trademark Application Processing ఫీజు అదనంగా Pay చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా బిజినెస్ సంబంధించిన Class ప్రకారం గా కూడా ఫీజు అదనంగా pay చేయాల్సి ఉంటుంది.

కు కావలసిన డాకుమెంట్స్ :

Applicant’s name, Business type, Business objectives, Brand/logo/slogan name, Registration address, Identity and business proofs.

Trademark రిజిస్ట్రేషన్ కొరకు Government fees Individual/ Startup/ Small Enterprise రిజిస్ట్రేషన్ లకు రూ. 4,500/- . రిజిస్ట్రేషన్ ల వారికి 9,000/- ల వరకు ఉంటుంది. Trademark attorney professional fees ఒక్కో క్లాసు మరియు అప్లికేషను కు రూ. 3500/- ఉంటుంది. ఈ ఫీజు process చేసే కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది.

మరియు ® symbols ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు?

Trademark కోసం Apply చేసిన తర్వాత Symbol ను బిజినెస్ logo పైన ఉపయోగించుకోవచ్చు. ఇతరులకు మనం మన బిజినెస్ కోసం Trademark apply చేసాము అనే విషయం తెలుస్తుంది. అంతే కానీ Legal గా వెళ్లేందుకు ఉపయోగపడదు. ® symbol విషయానికి వస్తే , ఇది కేవలం Apply చేసిన Trademark Process పూర్తయి, పూర్తిగా Approve వచ్చినపుడు మాత్రమే మన బిజినెస్ Logo పైన ఉపయోగించుకోవాలి. Trademark కోసం Apply చేసిన తర్వాత Approve అయ్యేందుకు 6 – 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version