Wednesday, April 17, 2024
HomeTechnologyChatGPT అంటే ఏంటి ? ఎలా ఉపయోగించాలి ?

ChatGPT అంటే ఏంటి ? ఎలా ఉపయోగించాలి ?

ChatGPT OpenAI

ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న word ChatGPT . అమెజాన్ , Netflix , Spotify లాంటి కంపెనీలకే subscribers వచ్చేందుకు సంవత్సరాలు పట్టింది, చాట్ జిపీటి  ఈ రికార్డ్ లను తిరగ రాసేసింది.లాంచ్ చేసిన 5 రోజుల్లోనే దాదాపు 1 మిల్లియన్ users రిజిస్టర్ అయ్యారంటేనే ఎంత పాపులర్ అయిందో అర్ధం చేసుకోవచ్చు.

ChatGPT, గూగుల్ సెర్చ్ కు గట్టి పోటీని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. లాంచ్ చేసిన వారం లోనే అంతమంది users సంపాదించి గూగుల్ సెర్చ్ కు షాక్ ఇచ్చింది.

దీనిని ఉపయోగించిన తర్వాత , ఎక్కువ మంది Google Search Engine కంటే కూడా ChatGPT నే అద్బుతంగా ఉందంటున్నారు.

గూగుల్ కూడా దీనికి పోటీగా Google AI – BARD ను త్వరలో ప్రారంబించనున్నారు.

ChatGPT OpenAI అంటే ఏంటి ? ( What is ChatGPT ? )

  • Chat GPT ( Generative Pre-trained Transformer ) అంటే , మనం ఏ సమాచారం కోసం వెతుకుతున్నామో , ఆ డేటా ముందుగానే Train చేయబడి సర్వర్ లలో save చేయబడి ఉంటుంది.
  • మనం అడిగిన ప్రశ్నలకు సమాదానం , సేవ్ చేయబడిన సమాచారం నుండి (Database) సేకరించి ఒక క్రమ పద్దతిలో  అందజేస్తుంది.
  • AI ( Artificial Intelligence ) టెక్నాలజీ వుపయోగించి తయారు చేయబడింది. Automated Chat Support అని చెప్పుకోవచ్చు. 
  •  GPT-3 language model ను ఉపయోగించుకుని చాట్ GPT పనిచేస్తుంది.
  • OpenAI (AI Research Company) , ఈ చాట్ GPT ను నవంబర్ 2022 లో లాంచ్ చేసారు.
  • 2015 లో కొందరు Entrepreneurs కలసి దీనిని స్టార్ట్ చేసారు. Elon Musk, Sam Altman మరియు మైక్రోసాఫ్ట్ వారు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసారు. Microsoft కంపెనీకి దీనిలో షేర్ ఎక్కువ వుంది.

Google Search వుంది కదా ? మరి చాట్ GPT కు ఉన్న తేడా ఏంటి ?

  • గూగుల్ లో సెర్చ్ చేస్తే వేలకొద్ది లింక్ లు మన ముందు ఉంచుతుంది , అదే చాట్ GPT లో కేవలం ఒకే ఒక straight ఆన్సర్ మన ముందు ఉంచుతుంది.
  • గూగుల్ ను సీర్చింగ్ కోసం ఉపయోగిస్తాము. చాట్ GPT తో వేరే వ్యక్తి తో మాట్లాడినట్లు డిస్కషన్ చేయవచ్చు.
  • గూగుల్ లో Search చేస్తాము , చాట్ GPT లో Prompt చేస్తాము ( టెక్నికల్ బాషలో )

ఎలా రిజిస్టర్ చేసి ఉపయోగించాలి ?

  • గూగుల్ లో ChatGPT అని సెర్చ్ చేస్తే ఈ లింక్ వస్తుంది , క్లిక్ చేసి open చేయొచ్చు https://chat.openai.com లేదా డైరెక్ట్ గ ఈ లింక్ బ్రౌజరులో టైపు చేసి open చేయాలి
  • జిమెయిల్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ లతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ చేయొచ్చు , లేదా ఈమెయిలు తో కొత్త అకౌంట్ create చేసుకోవచ్చు. ఈమెయిలు కు వచ్చిన verify లింక్ క్లిక్ చేసి verify చేయాలి.
  • తర్వాత మొబైల్ Number తో Verify చేయాలి
  • verify చేసిన తర్వాత క్రింద ఉన్న search bar లో Questions Prompt చేయాలి.

what is chatgpt telugu technology website

  • Prompt చేసిన తర్వాత ఒక Result ఇస్తుంది , Generate చేసిన data నచ్చకపోతే Regenerate క్లిక్ చేస్తే వేరొక data మన ముందు ఉంచుతుంది.
  • ChatGPT నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ గా ఉంటుందనే నమ్మకం పెట్టుకోవద్దు. ChatGPT Dashboard లోనే ఈ విషయం తెలియజేయబడి ఉంటుంది. 
  • దీనిలో Abused, Adult Content Search చేయకూడదు
  • 2021 వరకు Train చేయబడిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ChatGPT నుండి మనం పొందగలం.
  • చాట్ GPT Free గ మరియు Paid Subscription Plan (Monthly 20$ USD) లలో ఉపయోగించవచ్చు.
  • ChatGPT Plus Paid Subscription తీసుకుంటే Peak Times లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు, Response Time, fast గ ఉంటుంది, కొత్త ఫీచర్ లు వచ్చినపుడు Access ఉంటుంది.
  • Paid సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే, Login అయిన తర్వాత Dash Board లో ఉన్న Upgrade to Plus పైన క్లిక్ చేసి credit card ద్వారా పేమెంట్ చేసి Subscription తీసుకోవచ్చు.

ChtGPT Payment India

ChatGPT OpenAI ఎలా ఉపయోగాపడుతుంది

  • content writing చేసేవారికి ఆర్టికల్ రాయడానికి
  • Language Translate చేయడానికి ఉపయోగ పడుతుంది. ఒక text ను ఒక బాష నుండి మరొక బాషలోకి మార్చేందుకు ఉపయోగపడుతుంది.
  • IT సాఫ్ట్వేర్ జాబు చేసేవారికి కోడింగ్ రాసి ఇచ్చేస్తుంది
  • Job search చేసేవారికి Resume Preparation చేసిస్తుంది
  • ఆన్లైన్ , offline బిజినెస్ చేసేవారికోసం కావలసిన మార్కెటింగ్ Suggestions ఇస్తుంది
  • మన అవసరాలకు అనుగుణంగా , మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కరెక్ట్ words తో search ( Prompt ) చేస్తే , CHAT GPT ను అద్బుతం గ ఉపయోగించుకుని , ఎన్నో లాభాలు పొందవచ్చు.

Also Read : అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ఎలా వర్క్ అవుతుంది ? Part 1

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments