అకౌంట్ లో బాలన్స్ కోసం Bank వెబ్సైటు లు ఓపెన్ చేయడం లేదా Card బ్లాక్ చేయల్సివచ్చినప్పుడు బ్యాంకు కు కాల్ చేయడం లాంటి ప్రతి పనులకు సులువుగా అయ్యేందుకు కొన్ని బ్యాంకు లు తమ ఖాతాదారులకు ఈ సర్వీస్ WhatsApp లోనే ఉపయోగించుకునేలా WhatsApp బ్యాంకింగ్ సర్వీసును ప్రారంబించాయి.
ప్రముఖ ప్రైవేటు బ్యాంక్స్ Kotak Mahindra, HDFC మరియు ICICI Bank లు ఈ సర్వీసులు ప్రారంబించాయి.
ఎక్కువ మంది ఖాతాదారులను కలిగి ఉన్న SBI కూడా ఈ సర్వీస్ ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనుండి.
ICICI Bank WhatsApp Banking Service :
- ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే 9324953001 నెంబర్ ను మీ మొబైల్ కాంటాక్ట్స్ లో Save చేసుకోవాలి.
- మీ ICICI Bank అకౌంట్ తో లింక్ అయిన నెంబర్ WhatsApp నెంబర్ నుండి Hi అని మెసేజ్ చేయాలి.
- ఒక menu display చేయబడుతుంది.బాలన్స్ , హిస్టరీ,credit card లిమిట్ , Card Block / Unblock తదితర సేవలను ఉపయోగించుకోవచ్చు.
- మనకు ఏ సర్వీస్ కావాలో నెంబర్ టైపు చేయడం ద్వారా ఆయా సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.
- మరింత సమాచారం కోసం ICICI బ్యాంకు వెబ్సైటు చూడండి.
ఎలా చేయాలో క్రింది వీడియో చూడండి
అదేవిధంగా కోటక్ మహీంద్రా , మరియు HDFC బ్యాంకు ల సర్వీస్ లు కూడా WhatsApp ద్వారా వినియోగించుకోవచ్చు.
Kotak Mahindra WhatsApp Banking Service :
- మీ కోటక్ మహీంద్రా బ్యాంకు అకౌంట్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుండి 9718566655 నెంబర్ కు Missed Call ఇవ్వాలి. మీ మొబైల్ WhatsApp సర్వీస్ తో రిజిస్టర్ చేయబడుతుంది.
- మొబైల్ కాంటాక్ట్ లిస్టు లో 022 6600 6022 నెంబర్ ను మీ మొబైల్ లో Save చేసుకోవాలి.
- అకౌంట్ తో లింక్ అయిన నెంబర్ WhatsApp నెంబర్ నుండి Help అని మెసేజ్ చేయాలి.
- display చేయబడిన Instructions ఫాలో అవుతూ ,కావలసిన సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.
- మరింత సమాచారం కోసం కోటక్ మహీంద్రా బ్యాంకు వెబ్సైటు చూడండి.
HDFC WhatsApp Banking Service :
- ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే 70659 70659 నెంబర్ ను మీ మొబైల్ లో Save చేసుకోవాలి.
- అకౌంట్ తో లింక్ అయిన నెంబర్ WhatsApp నెంబర్ నుండి Help అని మెసేజ్ చేయాలి.
- display చేయబడిన Instructions ఫాలో అవుతూ ,కావలసిన సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.
- మరింత సమాచారం కోసం HDFC బ్యాంకు వెబ్సైటు చూడండి.