యూట్యూబ్ లో కొత్తగా మానిటైజేషన్ అప్డేట్ ( YouTube monetization policy Update 2023 )అనేది వచ్చింది . ఈ ఆర్టికల్లో క్లియర్ గా తెలుసుకుందాం.
ప్రస్తుతం YouTube Monetization కావాలంటే 4000 Watch Hours, 1000 Subscribers ఒక సంవత్సరంలోపు రావాల్సి ఉంటుంది. లేదంటే 90 Days లో 10 మిలియన్ YouTube Short Views రావాల్సి ఉంటుంది. Eligibility వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే మానిటైజేషన్ అనేది మనకు వస్తుంది.
Recent గ యూట్యూబ్ ఈ పాలసీని కొంచెం మారుస్తున్నట్లు Announce చేసింది. ఈ New Update వలన కొత్తగా ఛానల్ ప్రారంభించే Creators కు Encouragement గ ఉంటుందని YouTube తెలిపింది.
Monetization అనేది రెండు రకాలుగా ఉంటుంది…
- మొదటిది Part యూట్యూబ్ యాడ్స్. దీనిలో Watch Page Ads మరియు Short Feed Ads ఉంటాయి. రెండవది యూట్యూబ్ ప్రీమియం.
- రెండవ పార్ట్ Fan Funding Features (Membership , Super Stickers, Super Thanks & Shopping ).
ఈ రెండిటి ద్వారా యూట్యూబ్ నుంచి Money Earn చేయొచ్చు.
ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ తన పాలసీలో కొంచెం Change అనేది క్రియేటర్స్ కోసం తీసుకువచ్చింది. ఈ కొత్త పాలసీలో Fan Funding Features ముందుగా Creators కి అందజేయాలని యూట్యూబ్ భావించింది.
దీనికోసం YouTube New Eligibility కోసం ఏం కావాలంటే …
- 500 Subscribers రావాల్సి ఉంటుంది
- గడచిన 90 రోజుల్లో కచ్చితంగా మూడు వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి
- 3000 గంటలు Public YouTube Watch Time గత 12 నెలలు లోపల వచ్చి ఉండాలి
- లేదా 3 మిలియన్ షాట్ వ్యూస్ గడిచిన 90 రోజు లోపల వచ్చి ఉండాలి
ఈ కొత్త అప్డేట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే…
4000 గంటలు వాచ్ అవర్స్ 1000 మంది సబ్స్క్రైబర్లు తెచ్చుకోవాలంటే కొంతమంది క్రియేటర్స్ కు చాలా కష్టంగా మారింది. దానితో వారు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడమే మానేస్తున్నారు , యూట్యూబ్ ఛానల్ కూడా ఆపేస్తున్నారు. అలాంటివారిని Encourage చేయాలనే ఉద్దేశ్యం తో మానిటైజేషన్ (Fan Funding Features ) అందజేయాలని బావిస్తుంది.
Also Read :
- YouTube Channel Creators కు ఉపయోగపడే 3 మంచి టూల్స్
- గూగుల్ AdSense Approval ప్రాసెస్ ఏంటి ? మనీ ఎలా వస్తాయి?
Fan Funding Feature Early Access అనేది ఇప్పటివరకు ఏ Country కి అందజేయలేదు. త్వరలో United States, United Kingdom, Taiwan, Canada and South Korea క్రియేటర్స్ కి ప్రయోగాత్మకంగా అందజేయనున్నారు. తర్వాత ఇండియాతో సహా మిగిలిన దేశాలకు కూడా ఈ ( YouTube monetization policy 2023 ) ఫీచర్ అతి త్వరలో యూట్యూబ్ Creators కు వచ్చేస్తుంది.
బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి