ఏడు నెలల క్రితం ఆర్థిక శాఖ మంత్రి డిజిటల్ కరెన్సీ e-RUPI గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ డిజిటల్ కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , NPCI ( National Payment Corporation of India ) చేత లాంచ్ చేయబడుతుందని తెలిపారు.
అనౌన్స్ చేసిన తర్వాత నుంచి చాలామంది డిజిటల్ కరెన్సీ ని క్రిప్టో కరెన్సీ తో Compare చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ డిజిటల్ కరెన్సీ కి మరియు క్రిప్టో కరెన్సీ ఎటువంటి పోలిక లేదు.
ఇది QR Code లేదా SMS ఆధారంగా పని చేసే e-Voucher లాంటిది.
ఈ డిజిటల్ e-Rupee వల్ల మనకు కలిగే లాభాలేంటి ? ఒక కామన్ మ్యాన్ దీన్ని ఎలా ఉపయోగించుకోగలరు ? దీని వల్ల లాభం ఏంటి ? అనేది ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం.
e-RUPI / RBI Digital Rupee / Central Bank Digital Currency ?
మన దగ్గర ₹100, ₹500 రూపాయలు నోట్స్ ఎలా ఉన్నాయో, వాటికి వర్చువల్ రూపమే ఈ డిజిటల్ కరెన్సీ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత లీగల్ గా రూపొందించబడిన డిజిటల్ Currency.
డిజిటల్ రూపీని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు?
- RBI కి సంబంధించిన Sale మరియు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.
- మన రోజువారి ట్రాన్సాక్షన్స్ కోసం దీనిని ఉపయోగించవచ్చు.
ఈ డిజిటల్ e-RUPI ఎలా వర్క్ అవుతుంది ?
- Phonepe, Google Pay లలో ఎలా Money transfer చేస్తున్నామో , అదేవిధంగా పనిచేస్తుంది.
- ఇంటర్నెట్ , Phonepe, google Pay లాంటివి అవసరం లేదు . SMS లేదా QR కోడ్ ద్వారా వచ్చే Voucher తో Redeem చేసుకోవచ్చు.
- Buyers , Sellers మధ్య End-to-End Encryption వుండటం వలన మూడో వ్యక్తుల ప్రమేయం ఉండదు.
- ప్రస్తుతం మనము ఉపయోగిస్తున్నటువంటి Phonepe, Google Pay లా కాకుండా, దీనిలో డబ్బులు ముందుగా లోడ్ చేసి పెట్టుకోవాలి. అంటే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని Wallet లో పెట్టుకోవడం అన్నమాట.
- బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ను చాలా వేగంగా చాలా సులువుగా చేయవచ్చు
- ఫేక్ కరెన్సీ ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది
- కరెన్సీ ని ప్రింట్ చేయడానికి అవసరమయ్యే ఖర్చును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారీగా తగ్గించుకోవచ్చు
- Blockchain or Distributed Ledger technology (DLT) ఉపయోగించుకుని ఇది పనిచేస్తుంది.
Crypto కరెన్సీ కూడా DLT ఫాలో అవుతుంది కదా మరి దీనికి తేడా ఏంటి?
- Crypto ట్రాన్సాక్షన్స్ అన్నీ Encrypt అయి ఉంటాయి. Crypto కొనుగోలు చేసిన వ్యక్తికి అమ్మిన వ్యక్తి వివరాలు తెలియవు.
- ఎటువంటి కంట్రోల్ అనేది ఉండదు. లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కడ నుంచి జరుగుతున్నాయో తెలుసుకోవడం కూడా అసాధ్యం.
- సెక్యూరిటీ అనేది ఉండదు, గవర్నమెంట్ కంట్రోల్లో కూడా ఉండదు
- e-RUPI లో ఎక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనే పూర్తి పారదర్శకత కలిగి ఉంటుంది
- e-RUPI అనేది RBI కంట్రోల్ లో ఉంటుంది. ఈ-రూపీ కరెన్సీ మనం ఉపయోగి స్తున్న బ్యాంకుల ద్వారా మనకు రిలీజ్ అవుతాయి.
- ఏ బ్యాంకు లు పార్టనర్స్ గ ఉన్నాయో , మీ బ్యాంకు లిస్టు లో ఉందో , లేదో చెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
e-Rupee అనేది పూర్తిగా సురక్షితమేనా ?
- డబ్బు అంతా డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి ,సైబర్ సెక్యూరిటీ Risks ఉండే అవకాశాలు ఉంటాయి
- Uneducated People అర్ధం చేసుకోవడం కొంచం కష్టమే , cyber మోసగాళ్ళు ఇలాంటి వ్యక్తులను Target చేసే అవకాశాలు ఎక్కువ వుంటాయి
Also Read : గూగుల్ AdSense Approval ప్రాసెస్ ఏంటి ? మనీ ఎలా వస్తాయి?
ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, దీనిని Feature of Money గా చెప్పుకోవచ్చు.
- ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది త్వరలో మనకు తెలుస్తుంది.
- ప్రస్తుతం దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఆర్బిఐ రిలీజ్ చేసింది.