Wednesday, September 11, 2024
HomeMobilePink WhatsApp Scam నుండి జాగ్రత్త | ఇలా చేయండి

Pink WhatsApp Scam నుండి జాగ్రత్త | ఇలా చేయండి

Pink Whatsapp Scam Telugu

WhatsApp ఎన్ని కొత్త సెక్యూరిటీ updates తెస్తున్నప్పటికీ scam చేసేవారు కొత్త కొత్త మార్గాలద్వారా వాట్సాప్ users లను బురిడీకొట్టిస్తూనే ఉన్నారు. ఈ కొత్త App Scam నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము. 

ఏంటీ Pink WhatsApp ?
  • సోషల్ మీడియా users ను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త ఐడియాలజీ తో అందిన కాడికి దోచేస్తున్నారు. 
  • తాజాగా Pink WhatsApp పేరుతో మొబైల్ users కు లింక్ లు ఫార్వర్డ్ చేస్తున్నారు . ఈ లింక్ క్లిక్ చేసి  వాట్సాప్ install చేసుకుంటే Advanced Whatsapp Features, ఎక్కువ పింక్ కలర్ థీమ్స్, సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి వచ్చేస్తాయని మోసం చేస్తున్నారు. 
  • ఒక్కసారి లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ లో వుండే ఫొటోస్ , contacts ,  Net Banking passwords , ఇలా మొబైల్ లో పూర్తి సమాచారాన్ని Hack చేసేస్తున్నారు. 
  • ఈ ఫార్వర్డ్ మెసేజ్ లు అమ్మాయిల పేర్లతో చాట్ చేస్తున్నారు , మరియు Spoof Apps వుపయోగించి ఇతర country నుండి మెసేజ్ లు చేస్తున్నట్లు కూడా నమ్మ బలుకుతున్నారు.
  • unknown Numbers  నుండి ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయి , ఫ్రెండ్స్ నుండి కూడా ఇలాంటి మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతుంటాయి

Also Read : Whatsapp చాట్ కు Lock వేసేయవచ్చు | ఎలా చేయాలంటే

Pink WhatsApp బారిన పడకుండా Safe గా ఉండాలంటే…

  • పొరపాటున ఇలాంటి లింక్ క్లిక్ చేసి ఉంటే వెంటనే uninstall చేయాలి ( Settings > Apps > WhatsApp Logo ) 
  • మీకు తెలియని వ్యక్తులనుండి వచ్చిన లింక్ లను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దు
  • Official WhatsApp ను Google Play Store నుండి మాత్రమే Install లేదా Update చేసుకోవాలి. Third Party Apps ( ) అసలు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవద్దు.
  • ఇలాంటి లింక్స్ మీకు ఎవరైనా పంపి ఉంటే , వాటి గురించి పూర్తి గ తెలుసుకోకుండా మీ ఫ్రెండ్స్ కు లేదా గ్రూప్ లలో ఫార్వర్డ్ చేయొద్దు.
  • మీ మొబైల్ సెక్యూరిటీ కోసం మొబైల్ Anti Virus ను ఉపయోగించండి. ఇలాంటి Pink Whatsapp Scam లింక్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని Alert చేస్తూ వుంటాయి.

బిజినెస్ మరియు టెక్నాలజీ సంబందించిన వీడియో లకోసం ఇక్కడ Click చేసి YouTube Channel Subscribe చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments