Tuesday, November 19, 2024
HomeBusinessPAN Card ను Aadhar Card తో Link ఇలా సులువుగా చేసేయండి

PAN Card ను Aadhar Card తో Link ఇలా సులువుగా చేసేయండి

PAN Aadhar Card Link Process Telugu

PAN ను Aadhar తో Link చేయడం తప్పనిసరి. చేయకపోతే ఏమవుతుంది ? link చేయడం ఎలా ? లింక్ status ఎలా check చేయాలి ? అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

పాన్ కార్డు , ఆదార్ కార్డు తో లింక్ చేయడానికి ఆఖరి తేదీను జూన్ 30,2023 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు చేయని వారు ఫైన్ 1000 మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.  

లింక్ చేయకపోతే ఏమవుతుంది ?

  • PAN Card ఉపయోగం లేకుండా పోతుంది
  • Security Market లో జరిగే అన్ని లావాదేవీలకు PAN చాలా అవసరం.
  • చెల్లేలుబాటులో లేని PAN తో Bank Account open చేయలేరు.
  • బ్యాంకు లో 50,000 కంటే Fixed Deposit చేయలేరు మరియు 50 వేల కంటే ఎక్కువ Withdraw చేయలేరు
  • Income Tax రూల్ 1961 ప్రకారం చట్టపరమయిన చర్యలు తీసుకుంటారు మరియు 10 వేల వరకు  జరిమానా కట్టాల్సి వస్తుంది.
  • అదనపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేరు
  • షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కు కావలసిన Demat అకౌంట్ open చేయలేరు. Already ఉన్న అకౌంట్ లో investment కు అంతరాయం కలుగుతుంది.
  • Mutual Funds లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కష్టతరం అవుతుంది.
  • పాన్‌-ఆధార్‌ అనుసంధానం లేకపోతే Transactions లో పరిమితులు ఉంటాయి. Bank Transactions జరిగే సమయం లో ఎలాంటి అంతరాయం జరగకుండా ఉండేందుకు తప్పనిసరి గ పాన్ Card ను ఆధార్ Card తో Link చేసి ఉండాలి.

PAN Card, Aadhar Card Link Status Checking 

  • efiling website open చేయాలి https://www.incometax.gov.in/iec/foportal/
  • PAN Card Aadhaar తో లింక్ అయిందో లేదో ముందుగా check చేసుకోండి
  • దీనికోసం Link Aadhaar Status పై క్లిక్ చేయాలి
  • వచ్చిన విండో లో PAN * , Aadhaar Number * enter చేసి క్రింద ఉన్న View Link Aadhar Status బటన్ పైన క్లిక్ చేయాలి
  • ఆదార్ , పాన్ కార్డు తో లింక్ అయివుంటే Your PAN BFXXXXXX2L is already linked to given Aadhaar 70XXXXXXXX11 మెసేజ్ వస్తుంది లేదంటే  చేయాల్సి ఉంటుంది 

aadhaar linkin with pancard link status check telugu

PAN Aadhar Card Link Process – PAN Aadhaar Card లింక్ ఇలా చేయాలి 

  • efiling website open చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి
  • Left side లో Link Aadhaar పైన క్లిక్ చేయాలి
  • వచ్చిన విండో లో PAN, Aadhar నంబర్స్ enter చేసి క్రింద ఉన్న validate పైన క్లిక్ చేయాలి

PAN aadhar link telugu

  • Continue To Pay Through E-Pay Tax పైన క్లిక్ చేయాలి
  • పాన్ నెంబర్ 2 సార్లు , మొబైల్ నెంబర్ enter చేసి Continue పైన క్లిక్ చేయాలి
  • మొబైల్ కు వచ్చిన OTP తో verify చేయాలి, You Have Successfully Verifies Through Mobile OTP అని మెసేజ్ వస్తుంది. Continue పైన క్లిక్ చేయాలి
  • తర్వాత వచ్చిన విండో లో Income Tax సెక్షన్ లో Proceed పైన క్లిక్ చేయాలి
  • New Payment సెక్షన్ లో Assessment Year దగ్గర 2023-24 సెలెక్ట్ చేయాలి , Type of Payment దగ్గర Other Receipts 500 సెలెక్ట్ చేసి Continue పైన క్లిక్ చేయాలి

aadhar link pancard pay

  • తర్వాతి విండో లో pay చేయాల్సిన అమౌంట్ చూపెడుతుంది. Continue పైన క్లిక్ చేయాలి
  • తర్వాత వచ్చే విండో లో పేమెంట్ method select చేసుకుని Payment Gatewayఎంచుకుని అమౌంట్ ఆన్లైన్ లో pay చేయాలి.
  • క్రెడిట్ కార్డు , డెబిట్ కార్డు , నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా పేమెంట్ చేయవచ్చు.
  • The Challan Payment is Successful అని మెసేజ్ వస్తుంది
  • Challan కావాలంటే Download బటన్ పైన చేయాలి

PAN Aadhar Card Link Process challan

  • తర్వాత home Page లోకి వచ్చి Link Aadhaar పైన క్లిక్ చేసి , మొదట చేసినట్లే ఆదార్ , పాన్ enter చేసి validate పైన క్లిక్ చేస్తే పేమెంట్ వివరాలు తెలియజేయబడుతాయి. Continue పైన క్లిక్ చేయాలి
  • వచ్చిన విండో లో  ఆదార్ కార్డు లో Year Birth మాత్రమే ఉంటే First Option సెలెక్ట్ చేయాలి , Date Month Year ఉంటే రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేసి Link Aadhaar బటన్ పైన క్లిక్ చేయాలి
  • Validation Request submit చేయబడినట్లు మెసేజ్ బాక్స్ వస్తుంది

PAN Aadhar Card Link Process success

  • Status check చేయాలంటే home పేజి లోకి వెళ్లి status check చేసుకోవచ్చు. వెంటనే కాలేదంటే 4 or 5 days wait చేయాల్సి ఉంటుంది
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments