అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ఎలా వర్క్ అవుతుంది ?
ఆన్లైన్ లో మనీ సంపాదించాలనుకునే వారికి అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఒక మంచి platform అనే చెప్పాలి.ఈ ఆర్టికల్ లో అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలనుకునే వారు ముందుగా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? అనేది తెలుసుకోవాలి.
కొత్తగా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకునే వారికి ఈ గైడ్ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ గైడ్ లో Basics నుండి Advance టాపిక్స్ అవ్వడం జరుగుతుంది.
ఈ ఆర్టికల్ లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకోబోయే విషయాలు
- Affiliate మార్కెటింగ్ అంటే ఏమిటి ?
- ఎలా వర్క్ అవుతుంది ?
- అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ప్రారంభించాలి ?
అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి ?
సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ ను మనం ఆన్లైన్ లో refer చేసి ఆ ప్రోడక్ట్ sale చేస్తే కొంత కమీషన్ మనకు వస్తుంది . దీనినే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు.
ఉదాహరణకు : ప్రముఖ అమెజాన్ కంపెనీ వారి Affiliate వెబ్సైటు లో Register చేసుకుని , అమెజాన్ ప్రొడక్ట్స్ links ను మనం refer/Promote చేయడం ద్వారా, ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా Buy చేస్తే మనకు ఆయా ప్రోడక్ట్ ను బట్టి కొంత commission మనకు అమెజాన్ కంపెనీ వారు ఇస్తారు.
ఇలా ఒక కంపనీ ప్రోడక్ట్ లింక్స్ ను ప్రమోట్ చేసుకుని కస్టమర్స్ ఆ ప్రొడక్ట్స్ కొనేలా చేసేందుకు మనం ఒక ప్రాసెస్ follow అవల్సివుంటుంది.దీనినే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు.
Affiliate Marketing ఎలా వర్క్ అవుతుంది ?
అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ కోసం process ఉంటుంది. ఏంటంటే…
- ముందుగా అఫిలియేట్ ప్రోగ్రాం లో జాయిన్ కావాలి.
- మనం ప్రమోట్ / మార్కెటింగ్ / Refer చేయాలి అనుకున్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ( మనకు ఒక అఫిలియేట్ లింక్ వస్తుంది . ఆ లింక్ ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది) .
- లింక్ ను promote చేయాలంటే మనకు ఒక వెబ్‌సైటు లేదా బ్లాగు లేదా YouTube ఛానల్ ఉండాలి. Refer చేయాలి అనుకున్న లింక్ పోస్ట్ చేయాలి.
- ఎవరైనా మనం Refer చేసిన లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ కొంటె మనకు కొంత commission వస్తుంది.
అఫిలియేట్ మార్కెటింగ్ ఒక్క అమెజాన్ వెబ్ సైట్ మాత్రమే కాకుండా ఇతర eCommerce కంపెనీల నుండి కూడా చేయవచ్చు.
( ఉదా : మ్యూజిక్ instrument కంపెనీలు, shoe కంపెనీలు, వెబ్ సైట్ హోస్టింగ్ కంపెనీలు మొదలగునవి ). తర్వాతి Lessons లో వివరంగా తెలుసుకొందాము.
ఈ Affiliate మార్కెటింగ్ ఎలా ప్రారంభించాలి ? ఏమేమి కావాలి ?
అఫిలియేట్ మార్కెటింగ్ ప్రారంభించాలి అనుకుంటే ముఖ్యంగా కావలసినవి:
- మనం ఒక వెబ్ సైట్ లేదా బ్లాగ్ Run చేస్తూ ఉండాలి. వెబ్ సైట్ లేదా బ్లాగ్ కు visitors తప్పను సరిగా ఉండాలి.
- మన వెబ్ సైట్ లో రాసే కంటెంట్ కూడా రీడర్స్ కు నచ్చే విధంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన వెబ్ సైట్ ను visit చేస్తారు.(బ్లాగ్ లేదా వెబ్ సైట్ ఎలా చేయాలో తర్వాత తెలుసుకొందాము).
- బ్లాగ్ లేని వారు YouTube ఛానల్ అయినా కలిగి ఉన్నా అఫిలియేట్ మార్కెటింగ్ ప్రారంభించవచ్చు. చానెల్ కు ఎక్కువ మంది Subscribers కూడా ఉండాలి.
- vవీడియో లలో ప్రోడక్ట్ ల గురించి వివరిస్తూ Description లో అఫిలియేట్ లింక్ లు పోస్ట్ చేయాలి.
- Facebook పేజి కలిగి ఉన్నా కూడా ప్రారంభించవచ్చు.
- పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. visitors లేదా కస్టమర్ లను Attract చేసే విధంగా మనం పోస్ట్ చేసే కంటెంట్ ఉండాలి.
- మన వెబ్ సైట్ కు వచ్చిన రీడర్స్ నుండి email ids collect చేయడం ద్వారా ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా కూడా Affiliate Product Links Promote చేయొచ్చు.
- ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే … Visitors మనం ఇచ్చే కంటెంట్ ద్వారా వెబ్ సైట్ లేదా YouTube లేదా Facebook పేజీ లను ఎక్కువ visit చేసేలా ట్రాఫిక్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
- మనం ఎంత Effective గా , క్రియేటివ్ గ visitors ను సంపాదించుకోగలమో, అఫిలియేట్ మార్కెటింగ్ లో అంత ఎక్కువ సంపాదించగలము.
అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకునేవారు అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని Technical Words తెలుసుకుని ఉండాలి . అవేంటంటే …
- Affiliates: మన లాంటి అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవారు;
- marketplace : అఫిలియేట్ మార్కెటింగ్ కోసం ప్రొడక్ట్స్ అందించే వెబ్ సైట్ లు ( Ex : అమెజాన్ , Blue Hosting ..etc)
- ID : Affiliate అకౌంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒక ID మనకు ఇవ్వబడుతుంది;
- link : Refer చేయాలనుకున్న ప్రోడక్ట్ కు Affiliate ID జతపరచి వచ్చే లింక్.
- Affiliate Manager/OPM : Affiliate Marketing చేసేవారికి help చేసేందుకు ఆయా కంపెనీలు ఒక మేనేజర్ ను ఏర్పాటు చేస్తారు.
- Commission percentage : ప్రతి ప్రోడక్ట్ కు category ని బట్టి కమిషన్ అనేది వేరుగా ఉంటుంది.
తర్వాతి Lesson లో కొన్ని ముఖ్యమయిన విషయాలను తెలుసుకొందాము.
- అఫిలియేట్ మార్కెటింగ్ కు వెబ్ సైట్ లు ఎలా ఉండాలి ? తప్పనిసరిగా ఉండాలా ?
- ఎలాంటి కంటెంట్ రాస్తే ఎక్కువ visitors ను మన వెబ్ సైట్ visit చేసేలా చేయొచ్చు ?
- ఈ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా ఎంత డబ్బు సంపాదించవచ్చు?
- ఈ బిజినెస్ చేయాలంటే Qualification ఏంటి?
- అఫిలియేట్ మార్కెటింగ్ లో జాయిన్ అవాలంటే ఎంత ఖర్చవుతుంది?
ఈ పోస్ట్ పైన ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి . ఈ పోస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి.
Thank you for information