Franchise తీసుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నారా ?
Franchise బిజినెస్ లో మార్కెట్ అనాలిసిస్ రిపోర్ట్ ఫలితాలు పరిశీలిస్తే Franchise బిజినెస్ లో విజయావకాశాలు లు ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ, సక్సెస్ అనే దానికి గ్యారంటీ ఇవ్వలేం కదా ?
Success అనేది, బిజినెస్ ఎంత క్రియేటివ్ గా మార్కెట్ అవసరాలకు తగ్గ ట్లుగా ఎలా కస్టమర్ కి చేరవేయగాలిగాము, అనే దాని పైన ఆధారపడి ఉంటుంది.
ఒక బిజినెస్ లో సక్సెస్ రాలేదంటే … కారణం ఏంటంటే …? .. ఏదో ఒక బిజినెస్ ప్రారంభించాలి , బిజినెస్ లో సంపాదించేయాలని ఆలోచనే తప్ప … ప్రారంభించేందుకు కావలసిన వనరులని సమకూర్చుకొని , వారిని సరైన ప్లానింగ్ లేకుండా అమలు పరుచుకోవడమే.
Franchise బిజినెస్ లో కూడా నియమాలు తప్పనిసరిగా పాటించాలి . అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. క్రింది వీడియో చూడండి … ఛానల్ subscribe చేయండి .
మంచి Business Man కావాలంటే ఈ తప్పులు చేయొద్దు
ఫ్రాంచాయిసింగ్ అంటే ఏమిటి ?
ప్రాంచాయిస్ అంటే ఒక బ్రాండెడ్ కంపెనీ తో లీగల్ గా కమర్షియల్ రిలేషన్ maintain చేయడం.ఈ ఫ్రాంచాయిసింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది.
- Simple Form Franchise
- Business Format Franchise
ఫ్రాంచాయిసింగ్ లో ఒక సంస్థ యెక్క Trademark లేదా Trade Name ని మన బిజినెస్ అబివ్రుద్ది కోసం బిజినెస్ ఉపయోగించుకోవడం. దీనిలో కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ ని మన ప్రోడక్ట్ కి ఉపయోగించుకోవచ్చు.
దీని కోసం కంపెనీ యొక్క Terms and Conditions ద్వారా చేయాల్సి ఉంటుంది .ఈ రకమయిన ఫ్రాంచాయిసింగ్ ని Simple Form Franchise అంటారు.
కంపెనీ బ్రాండ్ ఉపయోగించుకోవడం తో పాటుగా మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే process ( బిజినెస్ కోసం ఎంత స్థలం కావాలి , మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి , ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది, బిజినెస్ సంబంధిత ట్రైనింగ్ , etc ) సంబంధించిన ప్రతిది Franchise తీసుకునేవారికి వివరంగా ఉంటే … ఈ రకమయిన ఫ్రాంచాయిసింగ్ ని Business Format Franchise అంటారు.
ఫ్రాంచాయిసింగ్ వలన లాభాలేంటి ?
- ఫ్రాంచాయిసింగ్ బిజినెస్ అంటే ప్రముఖ కంపెనీ బ్రాండ్ మార్కెట్ లో తెలిసి ఉంటుంది కాబట్టి , మార్కెటింగ్ కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు.
- కంపెనీ Setup కూడా ఫ్రాంచాయిసింగ్ ఇచ్చే కంపెనీ వారే చూసుకుంటారు.
- బిజినెస్ లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ సంబంధిత ట్రైనింగ్ కంపెనీ అందిస్తుంది కాబట్టి , మన కస్టమర్ కి సులువుగా అర్థమయ్యేలా అవగాహన కల్పించే అవకాశం వుంది.
- మన ప్రాంతం లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరాలు ఎక్కువ ఉంటాయో అలాంటి ప్రొడక్ట్స్ తో బిజినెస్ ని కష్టం లేకుండా ప్రారంభం చేసుకునే వీలుంది.
- మనం ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నా …. ప్రతి దానికి ఫ్రాంచాయిసింగ్ అందించే కంపెనీ లు ఎన్నో ఉన్నాయి.వీరు ఫ్రాంచాయిసింగ్ తీసుకొనే వారికి, బిజినెస్ సక్సెస్ అయ్యేందుకు తీసుకోవాల్సిన ప్రాసెస్ trainings ఇస్తూ , ఎలాంటి కష్టం లేకుండా చూస్తారు.
ఫ్రాంచాయిసింగ్ బిజినెస్ కోసం ముందుగా తెలుసుకోవాలనినవి….
- మనం ఎలాంటి బిజినెస్ కోసం ఫ్రాంచాయిసింగ్ తీసుకోవాలని అనుకొంటున్నామో , ఆ బిజినెస్ గురించి అవగాహన ఉండాలి.
- చేయబోయే బిజినెస్ కోసం ఎన్ని గంటలు పని చేయగలమో చూసుకోవాలి.
- ఫ్రాంచాయిస్ ఏ కంపెనీ నుండి తీసుకోవాలని అనుకొంటున్నామో… ఆ కంపెనీ మన బిజినెస్ లో ఏమైనా నష్టం జరిగితే ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది పరిశీలించుకోవాలి
- ఫ్రాంచాయిస్ కంపెనీ Track రికార్డు ఎలా వుంది ? మార్కెట్ లో ఆ ప్రొడక్ట్స్ కి ఎంత Good will ఉందో enquiry చేసుకోవాలి.
- మీరు చేయబోయే బిజినెస్ సంబంధించి , ఒకటికంటే ఎక్కువ కంపెనీ లు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి
- ఫ్రాంచాయిస్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నాము , బిజినెస్ రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు చూసుకోవాలి.
- బిజినెస్ లో మీకు కంపెనీ నుండి ప్రొడక్ట్స్ ఎలా Supply అవుతాయి , డైరెక్ట్ కంపెనీ ? లేదా మధ్యవర్తుల ద్వారా నా …ఇలాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి
- మీ పెట్టుబడి ఎప్పుడు మీ చేతికి వచ్చి , లాభాల్లోకి ఎప్పుడు అడుగు పెడతారు , అనే విషయాలు పరిశీలించుకోవాలి.
- కంపెనీ Terms and Conditions ఒక్కటి కూడా వదలకుండా చదువుకోవాలి , మీ సందేహాలను క్లియర్ చేసుకొని … పక్కా గా ప్లానింగ్ తో వెళ్ళాలి.
- ఏ కంపెనీ నుండి ఫ్రాంచాయిస్ తీసుకోదలిచామో , ఆ కంపెనీకి నేరుగా వెళ్లి మనకు కావలసిన సందేహాలు తీర్చుకోవాలి.
- మీరు తీసుకోబోయే ప్రోడక్ట్ వివరాలు , వాటి ధరలు , ప్రతి వస్తువుపై ఎంత లాభం ఉందో తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది.
ఫ్రాంచాయిసింగ్ అందించే కంపెనీ వివరాలు తెలుసుకోవాలంటే….
ఫ్రాంచాయిసింగ్ అందించే కంపెనీ వివరాలు తెలుసుకోవాలంటే కూడా మనకు కొన్ని వెబ్సైటు లు అందుబాటులో ఉన్నాయి.
వాటిలో మనకు కావలసిన బిజినెస్ కోసం ఏ కంపెనీ ఎంత కమీషన్ తీసుకొంటుంది ? ఫ్రాంచాయిసింగ్ ఫీజు ఎంత ? మన బిజినెస్ కోసం ఎంత పెట్టుబడి అవసరం ? ఇలాంటి వివరాలు దొరుకుతాయి.
కొన్ని వెబ్సైటు ల ద్వారా మీకు సరిపడే బిజినెస్ ఫ్రాంచాయిసింగ్ వివరాలు తెలుసుకోవచ్చు.
- https://www.franchiseindia.com
- http://www.franchisemart.in
- https://www.franchiseindia.net
- http://www.franchiseconnectindia.com
- http://www.startingfranchise.in
- http://www.franchisezing.com
- http://www.franchisebusiness.in
ఈ ఆర్టికల్ పైనా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. ఆర్టికల్ Like చేసి షేర్ చేయండి.