Tuesday, October 1, 2024
HomeBusinessమీ బిజినెస్ Growth కోసం Instagram ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా ?

మీ బిజినెస్ Growth కోసం Instagram ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా ?

Instagram for Business: Photo sharing కోసం Instagram చాలా పాపులర్ అయింది. ఎంత అయిందంటే Instagram లో జనవరి 2023 నాటికి సగటున 1.318 billion Active మెంబెర్స్ ఉన్నారు.

Facebook మరియు Twitter లతో పోల్చితే ఎక్కువ మంది Instagram ని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగిస్తున్నారు.బిజినెస్ చేసేవారు Instagram ఉపయోగించుకొని బిజినెస్ చేయొచ్చు.

మీ బిజినెస్ బ్రాండ్ మరియు ప్రోడక్ట్ లను ఎక్కువ మంది కి కనపడేలా చేయాలంటే Instagram ను చక్కగా వినియోగించుకోవచ్చు.

Instagram లో బిజినెస్ కు తగినట్లు ఎలా పోస్ట్ చేయాలి అనే కొన్ని ముఖ్యమయిన టిప్స్ ఈ ఆర్టికల్ లో తెలుసుకొందాము. Business Instagram అకౌంట్ create చేయాలి 

  • మీకు Instagram అకౌంట్ లేదంటే మొదటగా మీ మొబైల్ లో Instagram App ఇన్స్టాల్ చేసుకొని , మీ బిజినెస్ సంబంధించిన సమాచారం , బిజినెస్ లోగో తో అకౌంట్ ను అందంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
  • Profile ఇమేజ్ మీ కంపెనీ logo గా ఉండాలి, Logo చూసిన వెంటనే మీ బ్రాండ్ గుర్తుకువచ్చేలా ఉండాలి.  
  • అకౌంట్ ను బిజినెస్ కోసం మాత్రమే ఉపయోగించండి. Personal ఫోటోలు లాంటివి బిజినెస్ అకౌంట్ లో పోస్ట్ చేయవద్దు.
  • బిజినెస్ ప్రొఫైల్ Bio లో బిజినెస్ గురించి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఉండేలా చూసుకోవాలి.

Creative గా పోస్ట్ లు పెట్టడం ద్వారా …

  • Instagram లో మీరు పోస్ట్ చేసే ఇమేజ్ లో కస్టమర్ లకు Attract చేసేలా ఉండాలి.
  • Sales పైన కాకుండా కస్టమర్ లకు మీ క్రియేటివిటీ ద్వారా ఎలా సంపాదించాలి అనే దాని పైన దృష్టి పెట్టాలి.
  • ఫోటోల ద్వారా ,లేదా Short వీడియో ల ద్వారా మీ కంపెనీ ప్రోడక్ట్ ల వివరాలు , క్వాలిటీ తదితర వివరాలను కస్టమర్ కు తెలిసేలా చేయండి.

Instagram Stories ఆప్షన్ 

  • 24 గంటలపాటు కస్టమర్ timeline లో Top లో స్టోరీస్ Display అవుతాయి.
  • Instagram లో మీ బిజినెస్ Follow అయ్యే వారికి Instagram స్టోరీస్ కస్టమర్ కి త్వరగా చేరతాయి.
  • Instagram లో మీ ప్రోడక్ట్ Live వీడియో, Text ద్వారా ఆఫర్ వివరాలు, Image లు , Gif ల ద్వారా క్రియేటివిటీ జోడించి కస్టమర్‌లకు త్వరగా చేరువకావచ్చు.
  • Fun జోడించడం కోసం స్టికర్, Effects లు వీడియో లకు Apply చేసుకొని కస్టమర్ లను Attract చేయవచ్చు.

 #Tags ఉంచడం మరచిపోవద్దు #ట్యాగ్ లు (Ex : #TeluguStartup #Startup #Business ) Instagram లో చాలా ముఖ్యమయినవి.

మీ బిజినెస్ సంబంధించి Tag లు ప్రతిపోస్ట్ లో తప్పనిసరిగా Add చేయాలి. #Tag ఉపయోగించడం వలన మీరు Instagram లో పోస్ట్ ఎక్కువ కస్టమర్ లకు చేరుతుంది.

అనవసరమయిన #Tag లను ఉపయోగించకుండా, బిజినెస్ సంబంధించిన Tag లను మాత్రమే ఉపయోగించాలి.

సరైన Tag లను ఉపయోగించడం వలన బిజినెస్ కు సంబంధించిన కస్టమర్‌లకు మీ ప్రోడక్ట్ చేరుతుంది.

తద్వారా బిజినెస్ Improve అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Instagram లో ప్రతి పోస్ట్ కి 30 #Tag ల వరకు ఉపయోగించవచ్చు. ప్రతి పోస్ట్ లో మీ కంపెనీ కి సంబంధించిన , మీ బ్రాండ్ కు సంబంధించిన #Tag తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.     

మీ ప్రోడక్ట్ లను ఎక్కువ Buy చేసే కస్టమర్‌లకు మీరు పోస్ట్ చేసే ప్రోడక్ట్ వివరాలను వారి ప్రొఫైల్ తో ట్యాగ్ చేయండి. ( Ex :@TeluguStartup ).

ఇలా వారి ప్రొఫైల్ తో Tag చేయడం వలన ప్రోడక్ట్ వివరాలు వారికి త్వరగా Reach అవడం జరుగుతుంది.

Customer లను Follow అవడం చేయాలి మీ బిజినెస్ ని follow అయ్యేవారిని కూడా follow అవండి. మీ బిజినెస్ సంబంధించి Competitors ను follow అవుతూ , మీ బిజినెస్ కు వారి ఐడియాస్ ఎలా ఉపయోగపడతాయి Observe చేస్తూ ఉండాలి.

కస్టమర్ పోస్ట్ లకు రిప్లయ్ ఇవ్వడం , వారి పోస్ట్ లకు కామెంట్ చేయడం , కామెంట్ లలో మీ ప్రోడక్ట్ లింక్స్ ప్రమోట్ చేయడం కూడా చేయాలి.

కస్టమర్ ఇంట్రెస్ట్ కి తగినట్లు Instagram బిజినెస్ ప్రొఫైల్ ను Update చేస్తూ ఉండాలి.

Paid ప్రమోషన్ కూడా చేస్తూ ఉండాలి

Instagram లో మీ బిజినెస్ సంబంధించి ప్రోడక్ట్ లను  Advertisement చేయడం ద్వారా Paid ప్రమోషన్ చేసుకోవచ్చు.

దీనికోసం ప్రొఫైల్ ను బిజినెస్ ప్రొఫైల్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. మీ బిజినెస్ ప్రొఫైల్ లేదా పోస్ట్ Promote చేయడం ద్వారా ఎక్కువ మంది followers ని సంపాదించుకోవచ్చు.

Instagram Profile లేదా Post ఎలా Promote చేయాలి అనేది , మరో ఆర్టికల్ లో  వివరంగా తెలుసుకుందాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments